కోనసీమ జిల్లాలో రొయ్యల ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు తప్ప నిసరి అన్ని రకాల అనుమ తులు పొందడంతో పాటుగా పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను తప్పని సరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రొయ్యల పరిశ్రమల పర్యవేక్షణ తనిఖీ కమిటీ సభ్యులను జిల్లా ఆర్ మహేష్ కుమార్ ఆదేశిం చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ఇటీవల సిఫుడ్ సెక్టార్ లో బాండెడ్ లేబర్ లాస్ తదితర అంశాలు అమల్లో భాగంగా, పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యలు, అనుమ తులు పర్యవేక్షణ తనిఖీ కమి టీని నియమిస్తూ ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో జీవో నెంబర్ 123 ను ఈ ఏడాది మే 18న విడుదల చేసింద న్నారు. వీరికి అదనంగా జిల్లా కలెక్టర్ కమిటీ అధ్యక్షులు ఆర్ మహేష్ కుమార్ మరో ఐదు శాఖల అధికారులను ఈ పర్యవేక్షణ తనిఖీ కమిటీలో నియ మిం చారు. ఈ కమిటీకి నోడల్ అధికారిగా అసి స్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సభ్యులుగా జిఎం డిఏసి మత్స్యశాఖ జేడీ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్,ఎంపె డ అధికారులు డి ఎం అండ్ హెచ్ ఓ ఉన్నార న్నారు. ఈ కమిటీ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా జిల్లా లో తనిఖీలు 8 కాంపోనెం ట్స్ ప్రకారం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ నిర్వహిస్తున్నది లేని ది, కనీస వేతనాలు అమలు చేస్తున్నది లేనిది కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు వేస్ట్ వాటర్, వ్యర్ధాలు నిర్వహణ చేపడుతున్నది లేనిది క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పర్యవే క్షించి నిర్దేశిత ప్రొఫార్మాలో రిమార్కులను నమోదు చేయడం జరిగిందన్నారు. ఆ ప్రకారం గుర్తించిన పలు లోపాలను ఆయన అధికా రులను అడిగి తెలుసుకుని తీసుకున్న చర్యలను సమీక్షిం చారు. రొయ్యల ఫ్యాక్టరీల యాజమాన్యాలకు రిమార్కుల పై విధించిన జరిమానాలు చెల్లిం పు, లోపాలు దిద్దుబాటుకు తీసుకున్న చర్యలకు సమయం ఇచ్చి తదుపరి రెండు మాసాల కు మరలా తనిఖీ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహిం చడం జరుగుతుందన్నారు. రొయ్యల ఫ్యాక్టరీలు పర్యావ రణానికి హాని కలిగించకుండా ఉండటానికి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరన్నారు. ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థ జలాలు గాలి కాలుష్యంపై నియంత్రణ కోసం కాలుష్య నియంత్రణ మండలి అనుమతితోపాటు నడుపు కోవడానికి భవన నిర్మాణానికి పంచాయతీ అనుమతి పొందాలన్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ రొయ్యలను ఎగుమతి చేయాలంటే, ఎంపెడాలో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరన్నారు ఈ ప్లాంట్‌లో వ్యర్థాలను వేరు చేసి, శుద్ధి చేసిన తర్వాతనే నీటిని బయటకు పంపిం చాలనీ ఘన వ్యర్థాలు రొయ్యల వ్యర్థా లు, ప్యాకేజింగ్ మెటీరియల్ వంటి ఘన వ్యర్థాలను సరిగ్గా సేకరించి, వాటిని పర్యావరణా నికి హాని కలగకుండా నిర్మూ లించాలి లేదా రీసైకిల్ చేయా లన్నా రు.ప్రాసెసింగ్ యూనిట్లలో దుర్వాసన రాకుండా ఉండటా నికి తగిన జాగ్ర త్తలు తీసుకో వాలనీ.వివిధ శాఖల తనిఖీలు నిర్వహణ ఫ్యాక్టరీలలో పర్యా వరణ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి వివిధ ప్రభుత్వ శాఖలు క్రమం తప్పకుండా తని ఖీలు చేపట్టాలన్నారు.ఫ్యాక్టరీలోని పరిశుభ్రత, ఆహార భద్రత నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయాలన్నారు ఫ్యాక్టరీలలో ప్రాసెస్ చేసే ఆహారం నాణ్యత భద్రత ఉండాలని తనిఖీల ద్వారా ఫ్యాక్టరీలు పర్యావర ణాన్ని కాపాడటంతో పాటు, నాణ్యమైన ఉత్పత్తులను అందించ డానికి కృషి చేస్తాయ న్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి వి వి ఎస్ నారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ టి నాగలక్ష్మి, జిల్లా మత్స్యశాఖ అధికారి జీవి శ్రీనివాసులు డిఎంహెచ్వో దుర్గారావు దొర కాలుష్య నియంత్రణ మండలి ఇ ఇ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు