ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎ.పి.ఎస్.ఐ.డి.సి చైర్మన్ వేగుళ్ళ లీలా కృష్ణ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనాని జన్మదినాన్ని పురస్కరించుకొని తొలుత పలుప్రాంతాల్లో మొక్కలు నాటి
కేక్ కటింగ్ చేసి,ఉప ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పరిస్థితులను మార్చిందన్నారు. తదుపరి చెల్లూరు గ్రామ ఎంపీటీసీ గొల్లపల్లి అనురాధ పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను బహుకరిస్తూ, ముఖ్య అతిథి లీలా కృష్ణ చేతుల మీదుగా వారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు వల్లూరి సత్య ప్రసాద్, పిఎసిఎస్ డైరెక్టర్ తలాటం వెంకటేష్, గొల్లపల్లి వెంకటరమణ,పట్టిమి శివ, కొండేపూడి శివ, మోటారు పండు, సుంకర ప్రవీణ్,కిరణ్ తదితర జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

