14 October 2025
Tuesday, October 14, 2025

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత – కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందితో ప్రజలు సహకరించాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఎనిమిది, తొమ్మిది, పది వార్డులలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో గ్యాంగ్ వర్క్ నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని డ్రైనేజీలలో చెత్తను వేయడం వల్ల చెత్త పేరుకుపోయి డ్రైనేజీలలో ము రుగునీరు నిలిచి ఉండిపోవడం జరుగుతుందన్నారు. ప్రతి వార్డులోనూ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికి వచ్చి చెత్తను సేకరిస్తున్నారని అయినప్పటికీ ప్రజలు చెత్తను రోడ్డుపైన డ్రైనేజీలలో వేయడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ఖాళీ స్థలాలలో మొక్కలు పెరిగి విష పురుగులు చేరుతున్నాయని ఖాళీ స్థలాల యాజమానులు ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సానిటరీ మేస్త్రిలు రాజన్న అప్పారావు రాజు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo