ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా నాళం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం
సంపాదనే కాకుండా సమాజ సేవలు చేయడంలో ఆర్య వైశ్యులు ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుక మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా జరిగింది ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా నాలం శ్రీనివాసరావు, కార్యదర్శిగా కాకి అనిల్ సూర్య, కోశాధికారిగా కంకటాల రాంబాబు, వాసవి ఆర్గనైజింగ్ కన్వీనర్ గా పెరుమాళ్ల వీరేశ్వర రావు, గౌరవ అధ్యక్షులుగా మట్టే వరప్రసాద్, మద్దుల సోమరాజు నాని, ముఖ్య సలహాదారులుగా మద్దుల సత్యనారాయణ లచే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెలగా శ్రీరామ్మూర్తి, ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధి కాకుండా సమాజ అభివృద్ధిని కోరుకుంటూ సమాజ సేవ చేస్తున్న ఆర్యవైశ్యులు అభినందనీయులని అన్నారు. ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన నాలం శ్రీనివాసును కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే దుస్సాలువతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలోఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు కంటమణి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సూరపనేని చిన్ని సూర్యదేవర రంజిత్ కుమార్ పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు దాయన రామకృష్ణ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకట్రావు, క్లస్టర్ ఇంచార్జ్ పెనుమాక జయరాజు, వైఎస్ఆర్సిపి యువజన నాయకులు కంటమనే రమేష్ పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు చిట్టూరి అన్నవరం, తెలుగుదేశం నాయకులు కొప్పాక విజయనంద జవహర్ మరపట్ల కళాధర్ చక్రవర్తి తదితర ఆర్యవైశ్య సంఘం నాయకులు కొవ్వూరు పట్టణంలోని ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.