13 October 2025
Monday, October 13, 2025

లడ్డూని దక్కించుకున్న కౌన్సిలర్ చిట్టూరి సతీష్…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం 8వ రోజున మండపాల్లో కొలువైన గణపయ్యలకు విశేష పూజలు చేశారు. ఈ క్రమంలో 3 వ వార్డు శ్రీనగర్ వీధిలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో ప్రత్యేక దీపాలంకరణ చేసి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం లడ్డూ వేలంలో పాల్గొని, రూ 2010 నుంచి ప్రారంభమైన పాటలో రూ.12,555కి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. 2010 నుంచి ఆయన నిరంతరంగా లడ్డూ ప్రసాదాన్ని పొందుతూ వస్తుండటం విశేషం. ఈ ఏడాదీ ఆనవాయితీని కొనసాగించడంతో లక్ష్మీ గణపతి అనుగ్రహంతో లడ్డూ ప్రసాదం పొందారు. తరువాత కమిటీ సభ్యులు సతీష్‌ను కండువాలతో సత్కరించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏటా స్వామి వారి లడ్డూ ప్రసాదం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దీపోత్సవంలో మండపం ఎదురుగా కొలను ఏర్పాటు చేసి మధ్యలో గణపయ్యను కొలువుదీర్చారు. అలాగే శివలింగం, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఏర్పాటు చేసి దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా శోభాయమానంగా మారింది. శ్రీనగర్‌తో పాటు పక్క వీధుల్లోని మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo