గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండపేట పార్థసారధి నగర్ చిన్న మజీద్ వెనుక కొండయ్య బీడులో శ్రీ లక్ష్మీ గణపతి డ్రాగన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద బుధవారం రాత్రి దీపోత్సవం వైభవంగా జరిగింది. వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ చోడే శ్రీకృష్ణ జాహ్నవి స్వరూప దంపతులు దీపోత్సవంను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మాట్లాడుతూ 19 ఏళ్లుగా నిర్విఘ్నంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న డ్రాగన్ యూత్ సభ్యులను అభినందించారు. దీపోత్సవంలో భాగంగా మట్టి విగ్రహాలను తయారుచేసి దీపాలతో అలంకరించారు. పార్థసారథి నగర్, గాంధీనగరం పరిసర ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.