సామాన్యులపై దాడిని తీవ్రంగా ఖండించిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన కార్యకర్తలు అభిమానులు మండలంలోని పలు గ్రామాల్లో సైలెన్సర్ తీసిన బైకులతో మరియు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేశారు. దానిలో భాగంగా ఈతకోట గ్రామంలో గౌడ రామాలయం వద్ద సైలెన్సర్లు తీసిన బైకులతో రచ్చ చేస్తుంటే ఆ గ్రామస్తులు నిలదీసి అడగగా వారిపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. అప్పుడే స్కూల్ కి వెళ్లి తిరిగి వస్తున్న ఒక చిన్న పాప పై రాళ్ళు విసరగా ఆ పాప భుజానికి బలంగా తగిలింది. అలాగే అక్కడున్న ఒక మహిళకు ఆ రాళ్లు గడ్డానికి తగిలి రక్తం ఆగకుండా వచ్చింది. దాడికి దిగిన వారిని ప్రశ్నించినందుకు అక్కడ ఒక యువకుడిపై తల మీద గాయమయ్యేలా దాడి చేశారు. ప్రస్తుతం వీరు ముగ్గురు కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి . అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు మరియు సినిమా హీరోల పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవడం తప్పు కాదు గాని ఇలా జనాన్ని భయభ్రాంతులను చేయడం సామాన్య ప్రజల మీద దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. సైలెన్సర్లు తీసి బైకులతో రచ్చ చేయడం వల్ల ఇళ్లల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు చిన్న పిల్లలు భయభ్రాంతులకు గురవుతారని జరిగిన దాడిపై తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు , ఎంపీపీ మార్గాన గంగాధర్ రావు , మండల కన్వీనర్ ముత్యాల వీరభద్ర రావు , ముసునూరి వెంకటేశ్వరరావు , కొత్తపేట పార్టీ ప్రెసిడెంట్ సాలాది బ్రహ్మాజీరావు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు