14 October 2025
Tuesday, October 14, 2025

ఆ పామాయిల్ తోట నాది – నురుకుర్తి వీరలక్ష్మి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

‌సుప్రీంకోర్టు ఇటీవల ఆస్తిపై నాకు ఆర్డర్ కూడా ఇచ్చింది

ముత్య మాధురికి, సాల్మన్ రాజుకు ఆ పామాయిల్ తోటపై ఎలాంటి హక్కు లేదు

వారినుంచి నాకు ప్రాణహాని ఉంది

దౌర్జన్యంగా పామాయిల్ గెలలు కోసుకుపోతున్నారు

నా ఆస్తి నేను పొందకుండా ముత్య మాధురి, సాల్మన్ రాజు‌అడ్డుపడుతున్నారు

అందుకే పక్క పొలానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి కూలీలపై కేకలు వేసుంటారు

మీడియాతో పామాయిల్ తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

రంగంపేట మండలం ఈలగోలను గ్రామంలోని పామాయిల్ తోటలు తన సొంత ఆస్తి అని,వాటిపై నురుకుర్తి సాల్మన్ రాజుకు,ముత్య మాధురికి ఎలాంటి హక్కు లేదని తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి చెప్పారు ఆమె తన తండ్రి టి.వి.వి.సత్యనారాయణతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.నురుకుర్తి సాల్మన్ రాజుతో తనకు 1985లో వివాహం జరిగిందని,తమకు ,ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు పుట్టారని చెప్పారు .ఉద్యోగ రీత్యా సాల్మన్ రాజు దూరంగా ఉండేవాడని,2005లో తనను పుట్టింటికి పంపేశాడని ఆమె చెప్పారు.ఏడేళ్ళ వయసులో బాబు చనిపోయాడని ఆడపిల్లలు సాల్మన్ రాజు వద్దే ఉండేవారని తెలిపారు.తన పుట్టింటివారు ఇచ్చిన డబ్బుతో పామాయిల్ తోట 8 ఎకరాల 86 సెంట్లు కోనుగోలు చేసినట్లు వీరలక్ష్మి చెప్పారు. తాను నుంచి విడిపోయిన సాల్మన్ రాజు తర్వాత కాలంలో వేరే పెళ్ళి చేసుకున్నాడని ఆమె తెలిపారు. తాను చనిపోయానని ఆడపిల్లలకు చెప్పాడని ఆమె ఆరోపించారు. తల్లి బాగోగులు చూడని ఆడపిల్లలు,తల్లి జీవించి లేదని చెప్పే ఆడపిల్లలకు తన స్వంత ఆస్తి అయిన పామాయిల్ తోటపై హక్కు ఎలా ఉంటుందని ఆమె అన్నారు.అయితే ఆ తోటలపై వచ్చే ఆదాయం తాను పొందకుండా సాల్మన్ రాజు 2010లో సివిల్ కేసు వేశాడని వీరలక్ష్మి చెప్పారు.దాంతో తనకు ఆదాయం కూడా రాకుండా చేశారని, ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందాలని దరఖాస్తు చేసుకుంటే లక్షల విలువ చేసే పామాయిల్ తోట యజమానికి పెన్షన్ ఎలా ఇస్తారని అది రాకుండా సాల్మన్ రాజు,ముత్య మాధురి,మరో ఆడపిల్ల భాగ్య సుమ అడ్డుపడ్డారని ఆమె వాపోయారు.తన తలిదండ్రులు వృద్ధులని వారితో కలిసి జీవిస్తుంటే అక్కడ కూడా తనను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఆస్తి కోసం దౌర్జన్యం చేస్తున్నారని,దాంతో తమ తండ్రి సొంత ఇంటిలో ఉంటే చంపేస్తారని ‌భయపడి పోలీసుల రక్షణలో వేరే చోట ఉంటున్నామని వీరలక్ష్మి చెప్పారు.ఈ ఏడాది జనవరి 6 వ తేదీన ఆ తోటపై హక్కులు తనకేనని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. తమ పామాయిల్ తోట పక్కనే ఉండే మరో పొలం యజమాని మల్లిడి శ్రీనివాసరెడ్డిని తమ పామాయిల్ తోటలు చూడాలని కోరామని అందుకే ఆయన ఆ తోటలో దొంగతనంగా పామాయిల్ గెలలు కోస్తున్న కూలీలపై కేకలు వేసి ఉంటారని ఆమె అన్నారు.ముత్య మాధురికి ఆ తోటలకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు పామాయిల్ తోటలోకి కూలీలను ఎందుకు పంపించాలని నురుకుర్తి వీరలక్ష్మి నిలదీశారు. పామాయిల్ తోట విషయంలో ముత్య మాధురి ఆటలు సాగడం లేదని పక్కన ఉండి అడ్డుపడుతున్న మల్లిడి శ్రీనివాసరెడ్డిపై కూలీల చేత తప్పుడు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేయించి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులపై నెపం వేయడం సమంజసం కాదని,వారు లేకపోతే తనను బతకనివ్వరని ఆమె వాపోయారు‌సాల్మన్ రాజు, ముత్య మాధురి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆమె అందోళన వ్యక్తం చేశారు.పోలీసుల రక్షణ వల్లనే తాము ధైర్యంగా ఉంటున్నామని ఇకనైనా సాల్మన్ రాజు,ముత్య మాధురి తమ పద్దతి మార్చుకుని తన పామాయిల్ తోటల జోలికి రాకుండా ఉండాలని వీరలక్ష్మి హితవు పలికారు.సాల్మన్ రాజు రిటైర్ అయిన తరువాత అతడికి ఉద్యోగ రీత్యా రూ.కోటి వస్తే అది తన రెండో భార్యకుపుట్టిన కుమారుడుకి ఇస్తానని చెబుతూ, ఇద్దరు ఆడ పిల్లలను తానే పామాయిల్ తోటలపైకి ఉసిగొల్పుతున్నాడని వీరలక్ష్మి ఆరోపించారు.తనకు ఆధారంగా ఉన్న పామాయిల్ తోటల ఆదాయం తనకు దక్కేలా అందరు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo