రూరల్ సీఐ పీ దొరరాజు…
గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సందర్భంగా గణనాధుల నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో జరగాలని మండపేట రూరల్ సీఐ పీ దొరరాజు సూచించారు. మండలంలోని ఏడిదలో శుక్రవారం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనాల సమయంలో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు, డీజేలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఊరేగింపుల్లో పిల్లలను తీసుకెళ్లరాదని, విద్యుత్ వైర్లకు దూరంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిర్దేశించిన ప్రదేశాల్లో, నిర్ణీత సమయానికే నిమజ్జనాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.