14 October 2025
Tuesday, October 14, 2025

మండపేట లో ఘనంగా ఈద్ మిలాదున్నబి వేడుకలు…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అంతర్జాతీయ ఇస్లాం ప్రసంగీకులు డాక్టర్ మహమ్మద్ అహమద్ మిజ్ బాహి ప్రసంగించారు…

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట

శాంతి సామరస్యం ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని మండపేట జామియా మస్జిద్ ఇమామ్ గులాం మొహమ్మద్ ముర్షిద్ రజ్వీ పేర్కొన్నారు. సోదర భావంతో మెలగాలని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం అందించారని కొనియాడారు. మండపేటలో మహనీయ మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారి 1500 వ మిలాద్ వున్ నబీ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి వేడుకలు సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. కలువపువ్వు సెంటర్ వద్ద జామియా మస్జిద్ ఇమామ్ మహమ్మద్ గులాం మొహమ్మద్ ముర్షిద్ రజ్వీ పచ్చ జెండా ఊపి ర్యాలీ ఆరంభించారు. కలువపువ్వు సెంటర్ వద్ద వున్న జామియా మస్జిద్ నుండి ముస్లిం లు శాంతి ర్యాలీ నిర్వహించారు. టౌన్ హాల్ గౌరీశంకర్ వీధి, రైతు బజార్, గాంధీనగర్, పార్థసారథి నగర్,బిక్కిన అమ్మన నగర్, బస్ స్టాండ్, రాజారత్న సెంటర్ మీదుగా మెయిన్ రోడ్డు లో ర్యాలీ సాగింది. అనంతరం కేపీ రోడ్డు , రథం సెంటర్, టిడిపి కార్యాలయం రోడ్డు, వల్లూరి వారి వీధి మీదుగా రావులపేట లోని శ్రీమతి డొక్కా సీతమ్మ మునిసిపల్ కమ్యూనిటీ హాల్ వద్ద కు చేరింది.అనంతరం స్థానిక డొక్కా సీతమ్మ మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో మహాప్రవక్త జీవిత విశేషాలు అనే అంశంపై ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. విదేశాల్లో పలుచోట్ల ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన డాక్టర్ మహమ్మద్ అహ్మద్ మిజ్ బాహి మాట్లాడుతూ ప్రతి సమాజంలోనూ అసమానతలు, అణిచివేత ఉంటాయన్నారు. సాంఘిక దురాచారాలు అధిగమించి అసమానతలు తొలగించి అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయ మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారు సమాజంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. మానవులంతా సహోదర భావంతో మేలగాలని వర్ణ బేధం వర్గబేదం ,పేద ధనిక బేధాలు ఇస్లాంలో ఉండవన్నారు. ఇక్కడ అందరూ సమానమే అని పేర్కొన్నారు. దీనికి కారణం మహనీయ మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లెం వారు జీవితాంతం సమానత్వం పై ఆచరించి చూపారని పేర్కొన్నారు. ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. మహనీయ మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారి జీవితంలోని ముఖ్య సంఘటనలను వివరించారు. అనంతరం మండపేట హన్నపి అహలె సున్నత్ జామియా మస్జీద్ ఇమామ్ మొహమ్మద్ గులాం మహమ్మద్ ముర్షిద్ రజ్వి ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. శుక్రవారం కావడంతో జామియా మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుండి డొక్కా సీతమ్మ కళ్యాణ మండపానికి చేరుకొని అక్కడ విందు ఏర్పాటు చేశారు. అందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండపేట లోని నాలుగు మసీదులకు చెందిన బాధ్యులు కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ కన్వీనర్ సయ్యద్ ఇబ్రహీం, మండపేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు షేక్ ఇబ్రహీం, మండపేట జామియా మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మొహమ్మద్ అతవుర్ రహ్మాన్ ఎండి ఖాదిరి కరీం, సయ్యద్ రబ్బాని, మెకానిక్ కరీం,ఎండి గయసుద్దీన్ , సయ్యద్ అలీషా గాంధీ, సయ్యద్ ఇస్మాయిల్, అర్షద్, షేక్ గౌస్ మొహిద్దిన్, షేక్ బిలాల్, ఎండి సర్కార్,విజయలక్ష్మి నగర్ మజీద్ అధ్యక్షులు మౌలాలి, షేక్ మౌలానా, బాదుల్లా, మండపేట గాంధీనగర్ అల్ అమీనా మస్జిద్ అధ్యక్షులు ఎండి రహీం, సైదిల్ పేట హంజా మసీదు అధ్యక్షులు హర్షి తదితరులు తో పాటు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. మండపేట టౌన్ సి ఐ సురేష్ ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo