ఈ నెల 12,13 తేదీలలో ఆటో కార్మికులు జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రా ఆటోవాలా జిల్లా అధ్యక్షడు వాసంశెట్టి సత్తిరాజు మాట్లాడుతూ బంద్ జయప్రదం చేయాలని కోరారు. ఎన్నికల వాగ్ధానం ప్రకారం గడిచిన రెండు సంవత్సరాలకు రూ.30వేలు ప్రతీ ఆటో కార్మికుని ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులతో ఆటోలను అనుసంధానం చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు.

