Monday, August 4, 2025
Monday, August 4, 2025

20 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన  పిల్లి దంపతులు

కాకినాడ రూరల్ నియోజకవర్గం

ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని నియోజక వర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే “పిల్లి” దంపతులు అన్నారు. వలసపాకల లోని తమ నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆశ్రయించి దరఖాస్తు చేసిన 20 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 18 లక్షల విలువైన చెక్కులను కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కష్టాన్ని అర్థం చేసుకుంటూ ఆరోగ్య పరంగా ఎలాంటి భయం లేకుండా జీవించేందుకు ప్రభుత్వం నిస్వార్థంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.లబ్ధిదారుల్లో కొంతమంది గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైనఅనారోగ్యసమస్యలతో బాధపడుతున్నవారు ఉండగా, వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్సలు పొందారని చికిత్స అనంతరం వారికి వచ్చిన ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం నుంచి రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైందన్నారు.ఇది కేవలం చెక్కుల పంపిణీ కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమని ఎవరూ ఒకరికి అండగా లేకుండా నష్టంలో మిగలకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆయ‌న విజన్‌ను ప్రతి గ్రామానికి తీసుకెళ్లి, ప్రతి లబ్ధిదారుని ఆదుకునే బాధ్యత మనందరిదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్య భద్రత కోసం కట్టుబడి ఉన్నారని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన వారందరికీ సత్వరంగా నిధులను విడుదల చేయడం జరుగుతుందన్నారు. అవసరమైన పత్రాలు సమర్పించిన ప్రతి అర్హుడికి సహాయం అందేలా చూడటం మాకు బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన ఆర్థిక సాయానికి వారు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నియోజకవర్గ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo