Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

2వ తేదీన రైతులకు అన్న దాత సుఖీభవ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అమలాపురం

ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులం దరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు రూ.7 వేల జమ చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు గావించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలు తీరుపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.ఈసంద ర్భంగా జిల్లా కలెక్టర్ అధికా రులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు ఆర్దికంగా మరింత చేయూతను అందించే లక్ష్యంతో అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ 20వేల లు వంతున అన్న ధాత సుఖీభవ-పియం కిసాన్ కింద సహాయం అందించ డం జరుగుతోందని తెలిపారు. తొలి దశలో రాష్ట్రం రూ 5 వేలు కేంద్రం పిఎం కిసాన్ కింద రూ 2 వేలు వంతున వెరసి రూ 7 వేలు ఆగస్టు 2న అందించను దన్నా రు.ఈపధకానికి సంబంధించి ఇంకా ఇ-కెవైసి ఎన్సిపిఐ మ్యాపింగ్ కానివారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రం దించి ఇ-కెవైసి, మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయిం చుకోవాలని సూచించారు. ఈపధకం అమలుకు ఇంకా ఆగస్టు ఒకటో తేదీ మాత్ర మే సమయం ఉన్నందున ఈరెండు అంశాలు పెండింగ్లో ఉన్న రైతులం దరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదిం చాలని ఆయన సూచిం చారు. భూమిలేని సిసిఆర్సి కార్డు కలిగిన కౌలు రైతులు ఇ-క్రాపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వారికి అక్టోబరు మాసంలో ఇచ్చే అన్నధాత సుఖీభవ- పియం కిసాన్ నిధులు అందుతాయని స్పష్టం చేశారు.వెబ్ ల్యాండ్ పట్టాదారులకు ఇ-కెవైసి తప్పనిసరని వారికి ఆగస్టు 2వ తేదీన జమచేసే అన్న ధాత సుఖీభవ-పియం కిసాన్ నిధులు అందుతా యని ఆయన స్పష్టం చేశారు.అదే విధంగా ఈ కేవైసీ ,ఎన్సిపిఐ మ్యాపింగ్ కాని రైతులందరూ త్వరితగతిన వాటిని చేయించుకోవాలని ఆర్టీ జిఎస్ ద్వారా ఆయా రైతులం దరికీ సంక్షిప్త సందేశం(ఎస్ఎం ఎస్) వస్తుందన్నారు.అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ పధ కానికి అనర్హులుగా గుర్తించి తిరస్కరించబడిన వారికి ఎందుకు అనర్హులుగా గుర్తించి తిరస్కరించ డం జరిగిందనే దానిపై వ్యవసాయశాఖ అధికా రులు రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టంగా తెలియ జేయాలని ఆదేశించారు. అంతేగాక తిరస్కరించబడిన వారి వివరాలను ఆగస్టు 1వ తేదీలోగా మరొకసారి క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఎక్కడైనా అర్హత గల వారిని గుర్తిస్తే వెంటనే వారిని అర్హుల జాబితాలో చేర్చాలని స్పష్టం చేశారు. కొంతమంది రైతులకు సంబం ధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవడం, ఆధార్ సీడింగ్ సరిగా నమోదు కాకపో డవం,చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడం తో ఈపధకం వర్తించలేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తుంటాయని కావున వాటిపై రెవెన్యూశాఖ అధి కారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. ఈపధకం కింద లబ్ది పొందాలంటే ఇ-పంట మరియు ఇ-కెవైసిలో నమోదు తప్పని సరని స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం అర్హులకు అన్న దాత సుఖీభవ నిధులు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా చేరే విధంగా అధికార యంత్రాంగం పాటుపడాలన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు సమక్షంలో ఆగస్టు రెండో తేదీ పథకం నిర్వహణ తీరుపై సమావేశాలు నిర్వహిం చాలన్నారు.అన్నధాత సుఖీభవ-పియం కిసాన్ కు సంబంధించి రైతులు వారి స్టేటస్ ను అన్నదాత సుఖీభవ పోర్టల్ మనమిత వాట్సప్ గవర్నెస్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ టోల్ ప్రీ నెంబరు 155251 ద్వారా తెలు సుకొని వచ్చునన్నారు ఈ కార్యక్ర మంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి, జిల్లా వ్యవసాయ అధికారి వి బోసు బాబు, తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo