20 October 2025
Monday, October 20, 2025

31 వేల ఎకరాలకు జీవధార ..తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులకు 52 కోట్ల నిధుల మంజూరు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు రైతులు చేసిన పాలాభిషేకంతో ప్రతిధ్వనించిన కృతజ్ఞత

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరులో గల పుష్కర అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులకు ప్రభుత్వం 52 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా తాళ్లూరు లిఫ్ట్ వద్ద పుష్కర ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను రైతులందరూ కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పుష్కర అంతర్భాగమైన తాళ్లూరు లిఫ్ట్ సిమెంట్ పైపులు పూర్తిగా పాడై 31 వేల ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైసిపి ప్రభుత్వం దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గత ఎన్నికల్లో చంద్రబాబు జగ్గంపేట ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తాళ్లూరు లిఫ్ట్ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు హామీ ఇవ్వాలని కోరడం ఆయన వెంటనే స్పందించి హామీ ఇచ్చిన సందర్భంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుండి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనేకసార్లు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని ఇరిగేషన్ మంత్రిని అనేకసార్లు కలిసి నిధులు కోరడం తో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి 52 కోట్లు శాంక్షన్ చేసి క్యాబినెట్ ఆమోదం పొందడం జరిగిందని అన్నారు. అనంతరం డి ఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ తాళ్లూరు లిఫ్ట్ లో పూర్తిగా పాడైన సిమెంటు పైపులు స్థానం ఐరన్ పైపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 52 కోట్లు సాంక్షన్ చేసి క్యాబినెట్ ఆమోదం చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, అడప భారత్, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, బుర్రి సత్తిబాబు, సుంకవిల్లి రాజు, బొల్లం రెడ్డి రామకృష్ణ, పైడిపాల సూరిబాబు, రేఖ బుల్లి రాజు, అవసరాల బాలసుబ్రమణ్యం, బద్దిరెడ్డి అచ్చన్న దొర, దాపర్తి సీతారామయ్య, కురుకూరివీర వెంకట చౌదరి, యర్రం శెట్టి బాబ్జి, శిలామంతుల వీరబాబు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo