Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

8,9,10వ తరగతి విద్యార్థిని ,విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవగాహన ప్రచార కార్యక్రమం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

అమలాపురం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభు త్వ ప్రైవేటు పాఠశాలల కు చెందిన 8 9 10 తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి కెరీర్ గైడెన్స్ కొరకు విస్తృత అవగాహన ప్రచార కార్యక్ర మాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా విద్యాశాఖ మరియు మామిడికుదురు మండలం పూర్వపు విద్యా ర్థులైన నవీన్ సూర్య ప్రసాద్ రవీంద్రనాథ్ నిరంజన్ లు కెరీర్ గైడెన్స్ పై రూపొం దించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్క్ షాప్ ను నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ విద్యార్థినీ విద్యా ర్థులలో పాఠశాల స్థాయి నుంచి వారి యొక్క కెరీర్ గైడెన్స్ కొరకు వారికి ఉన్న ఆసక్తి మేరకు ఏ రంగాలలో స్థిరపడాలనుకున్నారో ఆ దిశగా స్థానికంగా లభించే ముడి సరుకు ఆధారంగా పారిశ్రా మికవేత్తలు గా ఎదగాలను కుంటే ప్రభుత్వ పరంగా ఉన్న సపోర్టు రాయితీల పై కూడా అవగాహన ను పెంపొందించే దిశగా ప్రచార అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు అదేవిధంగా వారి తల్లిదం డ్రుల సూచనల మేరకు మేరకు ఇంజనీర్లు డాక్టర్లు గా తయా రవ్వాలనుకుంటే వారికి ఉన్న అవకాశాలపై కరపత్రాలు, బ్రోచర్లు ప్రచార పత్రాలు, సామాజిక మాధ్యమాలు యాప్ల ద్వారా అవగాహనను పెంపొం దించాలని సూచించారు. కేవలం విద్యార్థినీ విద్యా ర్థులకు విస్తృత అవగాహన మాత్రమే కల్పించి గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని ఎట్టి పరిస్థితులలోనూ వారిని ఫలానా వృత్తి కోర్సులు తీసుకో వాలని బలవంతం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. కెరీర్ గైడెన్స్ కొరకు చేపట్టాల్సిన విస్తృత అవగాహనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్క్ షాప్ ను నిర్వహించి అవగాహనను కల్పించారు పాఠశాల స్థాయి నుంచి కెరీర్ గైడెన్స్ ఏ విధంగా రూపొందించి వారి భవిష్యత్తుకు సంబంధించి ఏ అవకాశాలు ఉన్నాయో సూచన మాత్రమే చేయాల న్నారు. విద్యా ర్థులకు ఉన్న ఆసక్తి తగ్గకుండా కెరీర్ గైడెన్స్ కొరకు పాటుపడాలన్నారు. కెరీర్ గైడెన్స్ పాఠశాల స్థాయి నుంచి అభివృద్ధి చేయడం మూలంగా ఆసక్తి ఆనుగుణంగా మంచి అవకాశాల ద్వారా ప్రోడక్టివిటీ తో ఉన్నత శిఖరాలు అధిరో హించగలుగుతారని తెలిపారు. విద్యార్థులకు ఉన్న ఆలోచ నలకు మంచి గైడెన్స్ను అం దించాలని సూచించారు కౌన్సిలింగ్, యాప్ లు వర్చువల్ , సామాజిక మాధ్యమాలు, దినపత్రికలు మ్యాగజైన్స్ కరపత్రాలు, భౌతిక విధానంలోనూ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహిం చాలన్నారు. విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తు కెరీర్ గైడెన్స్ కొరకు ఒక మంచి ప్లాట్ఫా రం జిల్లా వ్యాప్తంగా రూపొం దించి విస్తృత అవగాహన ను పెంపొందించాలని సూచించా రు. పాఠశాలల్లో విపశ్యన ధ్యాన యోగ కార్య క్రమాలు కొన సాగుతు న్నాయని తెలిపారు. జ్ఞాన యోగ బృందాలు ముందుగా టీచర్లకు యోగ ప్రక్రియలపై అవగాహన పెంపొందించి విద్యార్థులకు రెండు పూటలా నేర్పించడం జరుగుతుందని తెలిపారు ఈ ప్రక్రియను సంబంధిత ఆర్డీవోలు పర్యవేక్షించడం జరుగుతుం దన్నారు. మామిడికుదురు కు చెందిన పూర్వపు విద్యా ర్థులు కెరీర్ గైడెన్స్ నూతన ఓరవడికి శ్రీకారం చుట్టి పాఠశాల విద్యలో కెరీర్ గైడెన్స్ నాణ్యతను మెరు గుప రిచేందుకు సహాయం చేయాలని ముందుకు వచ్చారన్నారు. మీరు పాఠశాల పేరు మీద ఒక వెబ్సైట్ పోర్టర్లు రూపొం దించి అవగాహనను కల్పిస్తున్నారన్నారు. పూర్వపు విద్యార్థు జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా పాఠశాల గురించి తెలుసుకొని కెరీర్ లక్ష్యా లను సాధించడంలో సహాయ పడాలని సంకల్పించారన్నారు. విద్యార్థుల సేవల పట్ల అంకితభావంతో మానవ సామర్థ్య శక్తి పై నమ్మకంతో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారన్నారు. ఈ విధానం మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడుతుందన్నారు స్థానికంగా లభించే ముడి సరుకు ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ప్రేరేపించి ఔత్సాహిక విద్యార్థి పారిశ్రామికవేత్తలను ప్రోత్స హిస్తుందన్నారు.. ఈ కార్యక్ర మంలో జిల్లా విద్యాశాఖ అధికారి సలీం భాష,పాఠశాల పూర్వపు విద్యార్థి నవీన్, ప్రధానో పాధ్యాయురాలు నిరంజన్, రిటైర్డ్ హేడ్ మాస్టర్ రవీంద్ర నాథ్, ఎన్జీవో సూర్య ప్రసాద్ ధ్యాన యోగ నిపుణులు అమర్ తదితరులు పాల్గొన్నారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo