WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

“మహిళల అతి ఆలోచనలే మానసిక అనారోగ్యం”

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హల్ లో "మహిళలు మానసిక అనారోగ్యం" పై సదస్సు

విశ్వంవాయిస్ న్యూస్, హైదరాబాద్

“మహిళల అతి ఆలోచనలే మానసిక అనారోగ్యం”

 

– ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్

 

మహిళల అతి ఆలోచనలే మానసిక అనారోగ్యానికి దారితీస్తాయిని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు.డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హల్ లో “మహిళలు మానసిక అనారోగ్యం” పై సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై చైతన్యం పెంచడానికే ఈ కార్యక్రమని తెలిపారు.అక్టోబర్ 10,2024న జరుపుకునే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రధాన థీమ్ “పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్యం”ఈ సంవత్సరం ప్రత్యేకంగా వృత్తిపరమైన మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది న్నారు. కోవిడ్-19 అనంతరం, ఉద్యోగాలలో ఒత్తిడి, ఆందోళన, బర్నౌట్ చాలా ఎక్కువగా పెరిగాయని తెలిపారు.మానసిక ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగమని చెప్పారు.అతి ఆలోచనలు అనేవి ఒకే ఆలోచన లేదా పరిస్థితిపై ఎక్కువగా దృష్టి పెట్టడం, దానిపై మళ్లీ మళ్లీ ఆలోచించడం మహిళల్లో ఇది ఎక్కువగా కనిపించే లక్షణమన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నా రన్నారు.మహిళలు తరచూ సామాజికంగా వృత్తిపరంగా,కుటుంబ పరంగా,వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే బాధ్యతలతో సతమత మౌతుంటారన్నారు.దీనివల్ల వారు తమ మానసిక శాంతిని కోల్పోయి అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. పూర్వపు సాంప్రదాయాలు,లింగ సమానత్వం లోపం,కొన్నిసార్లు ఆర్ధిక సమస్యలు మహిళలను ఒత్తిడిలోకి నెడుతాయని చెప్పారు.వివాహం, పిల్లల పుట్టుక మహిళలు ఎదుర్కొనే ప్రధాన మానసిక సమస్యలన్నారు. మహిళలు అతి ఆలోచనలను గమనించి, వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తే, వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు.అదే సమయంలో వారి కుటుంబ,వృత్తి జీవితాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. చిన్న చిన్న టేక్నిక్స్ ద్వారా అతి ఆలోచనలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియజేశారు.

 

మానసిక ఆరోగ్యం వారోత్సవాలు:

ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నవభారత లయన్స్ క్లబ్* ఆధ్వర్యంలో వారం రోజుల పాటు (4 నుంచి 10)వ తేదీ వరకు విద్యార్థులకు, కార్యాలయాలు, పత్రికా విలేఖరులుకు, ఉద్యోగాలకు, రామకృష్ణ మఠం, స్లమ్ ఏరియాలో, హోమ్స్, వృద్ధాశ్రమంలలో అవగాహన కల్పించడం కోసం వారం రోజుల పాటు మానసిక ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా మానసిక వైద్యుల డా.రవ్వహరి కుమార్,1 వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డా.జి.మహేంద్ర కుమార్ రెడ్డి, యోగా గురు సరోజని రామారావు, లయన్స్ సి.హెచ్. గోపాల్ కృష్ణ, జి.కృష్ణ వేణి, పి.స్వరూపారాణి, కె.శోభా రాణి, జ్యోతి రాజా తదితరులు పాల్గొంటారన్నారు. వివరాలకు @ 9390044031 నెంబర్ కు సంప్రదించగలరు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement