WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

సంవత్సరం తొమ్మిది నెలల నుంచి ఒకే థియేటర్లో ఆడుతూ ఉన్న ఆర్ఆర్ఆర్ 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU


యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli)కాంబోలో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్.విశేషప్రేక్షాదరణని పొందటంతో పాటుగా ఇండియాలోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కలెక్షన్స్ పరంగా కూడా చాలా ఏరియాల్లో సరికొత్త రికార్డులని నెలకొల్పడమే కాకుండా ప్రతిష్టాత్మక ‘ఆస్కార్'(oscar)సైతం అందుకొని  తెలుగు వారి కీర్తిని విశ్వ వ్యాప్తం చేసింది. వరల్డ్ సినిమా పితామహుడిగా పిలవబడే జేమ్స్ కామెరూన్(James Cameron)సైతం ఆర్ఆర్ఆర్ ని వీక్షించి మెచ్చుకున్నాడు.

ఇంతటి ప్రత్యేకతలు ఉన్న ఈ మూవీ తాజాగా ఒక అరుదైన ఘనతని సాధించింది.జపాన్(japan)దేశంలోని ఒక థియేటర్ లో సంవత్సరం తొమ్మిది నెలలు అంటే ఇరవై ఒక్క నెలల నుంచి ప్రదర్శితమవుతూ ఉంది. జపాన్ లో ప్రపంచ భాషలకి చెందిన చాలా సినిమాలు ఎప్పట్నుంచో విడుదల అవుతూనే ఉన్నాయి. కానీ ఏ సినిమా కూడా ఇంత వరకు ఈ రేంజ్ లో రన్ అవలేదు.అలాంటిది ఒక భారతీయ సినిమా, అందులోను తెలుగు సినిమా అన్ని రోజుల నుంచి కంటిన్యూ గా ఆడటం ఒక అరుదైన రికార్డు అని చెప్పాలి 

ఆర్ఆర్ఆర్ యూనిట్ కూడా ఈ విషయం పై తమ ఆనందాన్ని వ్యక్తం చెయ్యడమే కాకుండా ఎంతో గర్వకారణంగా ఉందంటూ ట్వీట్ చేసింది.ప్రెజంట్ ఎంత పెద్ద హిట్ సినిమా అయినా కూడా యాభై రోజులు ఆడటం చాలా కష్టమయిపోతుంది.కలెక్షన్ లే  కొలమానంగా సినిమా హిట్ రేంజ్ గురించి చెప్పుకుంటున్నాం.అలాంటిది ఆర్ఆర్ఆర్ అన్ని రోజుల ఆడటం గ్రేట్ అని చెప్పుకోవాలి.

 




Source link

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement