WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

తల్లి పాదాల చెంతే స్వర్గం  | Heaven at mother feet

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU


posted on Oct 18, 2024 4:46PM

జహంగీర్ భాయ్ కు ఏడుగురు కొడుకులు. అందరి పెళ్లిళ్లు జరిగాయి. కానీ ఏ ఒక్క కొడుకు జహంగీర్ భాయ్ ఆలనాపాలన చూడటం లేదు. జహంగీర్ భాయ్ కు ఉన్న ఆస్తిని సమంగా పంచితేనే తండ్రిని బాగా చూసుకుంటామని కొడుకులు బస్తీవాసులకు తెగేసి చెప్పేశారు. పెళ్లీడుకొచ్చిన  ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు అయ్యాక ఆస్తిని పంచుతానని ఖరా ఖండిగా చెప్పేశాడు జహంగీర్ భాయ్ . తన కొడుకులను వెంట పెట్టుకుని మౌలానా దగ్గరికి వచ్చాడు జహ్గంగీర్ భాయ్.  

మౌలానా: సలాం వాలేకుం జహంగీర్ భాయ్ 

జహంగీర్ భాయ్: వాలేకుం సలాం మౌలానా సాబ్ , మౌలానా సాబ్ 50 ఏళ్లు నా కొడుకులకు అన్నీ ధారపోశాను. పెళ్లిళ్లు చేశాను. మనవళ్లు, మనవరాళ్లు పుట్టే వరకు అన్నీ కార్యాలు చేశాను వృద్దాప్యంలో నాకు ఉన్న ఒక్కగానొక్క ఇల్లు పంచమని నా కొడుకులు వేధిస్తున్నారు. ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేసే వరకు ఇల్లు పంచను. నా భార్య కూడా చనిపోవడంతో నేను దిక్కులేకుండా అయ్యాను. 

మౌలానా కూడా అదే బస్తీలో పెరగటంతో జహంగీర్ భాయ్ గూర్చి పూర్తిగా తెలుసు. కొడుకులకు హితబోధ చేయాలనుకున్నాడు మౌలానా. దివాన్ ఖానాలో కూర్చో బెట్టి తన తక్రీర్( ప్రవచనం) ప్రారంభించాడు మౌలానా 

 మౌలానా: భయం, భక్తి లేకుండా తల్లిదండ్రులను దూషిస్తున్నారు. మరికొన్ని చోట్ల కన్నవారిని కొడుతున్నారు. తల్లిదండ్రులు రోదిస్తున్నారు. అమ్మాయిలు కూడా నచ్చిన అబ్బాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలు నచ్చిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం కరెక్టు కావచ్చు.  మేజర్ అయిన అమ్మాయిలు  పెళ్లి చేసుకోవడం వల్ల ఎక్కువగా బాధపడేది తల్లిదండ్రులే. బ్రిటీషు పాలనలో వచ్చిన ఈ చట్టాల వల్ల సాంప్రదాయ ఇస్లాం కుటుంబాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఆంగ్లేయులు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వరు. వారికి ఇష్టం ఉన్నవారికే ఆస్తులు ఇవ్వొచ్చు. మేజర్లు ఇష్ట ప్రకారం పెళ్లిళ్లు చేసుకోవచ్చు అని చట్టాలు చెబుతున్నాయి.  కానీ అవే  చట్టాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోయాక పిల్లలకు  ఆస్తి దక్కుతుంది.  కాబట్టి బతికి ఉండగానే చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేరం చేస్తే మన చట్టాలతో బాటు అల్లా  కూడా క్షమించడు. ఆ విషయాన్ని పిల్లలు  గ్రహించలేకపోతున్నారు. భూమ్మీద ప్రతీ ప్రాణి తన సంతానం పెంచుకోవాలని చూస్తుంది. తల్లిదండ్రులు  కూడా అదే కోవలోకి  వస్తారు. తల్లిని తల్లి అంట లేరు. తండ్రిని తండ్రి అంట లేరు. తల్లిదండ్రులను విస్మరిస్తే రేపు మీ పిల్లలు మిమ్మల్ని విస్మరిస్తారు. భార్యల మాటలు విని కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. తల్లి పాదాల్లో స్వర్గం (మా కీ కద్మో మే జన్నత్)  ఉంటుంది. విమానంలో ఎయిర్ హోస్టస్ ఎంత వినయంగా, సంస్కారవంతంగా మాట్లాడుతుందో అలా మాట్లాడాలి మన తల్లిదండ్రులతో. సృష్టిలో అత్యంత విలువైన వ్యక్తి తల్లి.  ఆ తర్వాతే తండ్రి. వారికి ప్రేమను పంచాలి. అది మన బాధ్యత. విమెన్ రైట్స్ గురించి పాటు పడే  వారు తల్లి హక్కు కోసం పాటు పడటం లేదు. నాకు తెలిసిన  ఓ కుటుంబంలో కుర్రవాడు తల్లిదండ్రులను పట్టించుకోలేదు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ యువకుడు  పూర్తిగా చెడిపోయాడు.  తండ్రిని దూషించిన తరహా తల్లిని కూడా  దూషించడం ప్రారంభించాడు. ఒక రోజు తన తల్లిని  చెప్పుతో కొట్టాడు.  తల్లి బాధపడింది. శాపనార్థాలు పెట్టింది. తల్లి ఎప్పటికీ శాపనార్థాలు పెట్టదు. కానీ కొడుకుకు పెట్టిన శాపనార్థం నిజమయ్యింది.  కొడుకు యాక్సిడెంట్ కు గురై చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడాడు.    కొడుకు  ఆరోగ్యం తెలుసుకుని   తల్లి గుండె  తల్లడిల్లింది. అల్లాను మరో మారు వేడుకుంది. నా కొడుకు ఆరోగ్యం బాగు పడాలని ప్రార్థించింది.  ప్రాయశ్చిత్యానికి గురైన కొడుకు  కూడా తల్లికి క్షమాపణ కోరాడు. తల్లి ప్రార్థన, కొడుకు క్షమాపణ ఫలించింది. యాక్సిడెంట్ వల్ల చావుకు దగ్గరైన కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. కాబట్టి తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పక ఉండాలి అని మౌలానా తన తక్రీర్ లో హితవు పలికాడు. 

                                                                                       -బదనపల్లి శ్రీనివాసాచారి



Source link

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement