వైఎస్ జగన్ రెడ్డి ఆస్తుల్లో వాటా ఉంటే, వైఎస్ షర్మిల ఎందుకు జైలుకెళ్లలేదు? ఇప్పుడిదే ట్రెండింగ్ ప్రశ్న, టాపిక్. వైసీపీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని ఇతర నేతలు షర్మిలపై ప్రశ్నలు సంధఇంచిన సంగతి తెలిసిందే. వాటాలు ఉంటే జైలుకు వెళ్లలేదు? ఎంతసేపూ ఇదే ప్రశ్నే అందరిలోనూ. దీంతో మీడియా ముందుకొచ్చిన షర్మిల అడిగినోళ్లకు అడిగినంత, కావాల్సినోళ్లకు కావాల్సినంత ఇచ్చి పడేశారు షర్మిల. ఆస్తుల్లో వాటాలు ఉంటే జైలుకు వెళ్లాలా? అలాగైతే వైఎస్ భారతీ ఎందుకు జైలుకెళ్లలేదు అని సూటి ప్రశ్న సంధించారు. అంతేకాదు వాటాలు ఉన్నంత మాత్రాన జైలుకెళ్లాల్సిందేనని, కేసులు ఉంటాయని ఎక్కడైనా రూల్స్ ఉన్నాయా అని ప్రశ్నించారు.
ఒక్కటైనా చెప్పన్నా!
వైఎస్ జగన్ జైలుకెళ్లినప్పుడు అన్న కోసం, వైసీపీ కోసం నేను, అమ్మ ఎన్నో చేశాం. ఆఖరికి ప్రాణాలు అర్పించడానికి కూడా నేను సిద్ధమయ్యాను. కనీసం నాకు ఇదిగో ఇది చేశానని జగన్ జన్మలో ఒక్కటైనా చెప్పగలరా? అని షర్మిల ప్రశ్నించారు. నేను పడిన కష్టాన్ని వైసీపీ నేతలు, ఆఖరికి అన్న జగన్ కూడా అన్నీ మరిచిపోయారు. అయినా సరే అన్నంటే నాకిష్టమే. ఆయన కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటాను. ఎందుకిలా జరుగుతోందని అమ్మ తలుచుకుని బాధపడుతున్నారు. ఇవన్నీ చూడటానికే నేను బతికి ఉన్నానా? అని అమ్మ అంటున్నారంటూ షర్మిల బోరున ఏడ్చేశారు.
మీకిది తగునా?
వైఎస్ బతికుండగా నలుగురు మనవళ్లకు ఆస్తిలో వాటా ఇవ్వాలని చెప్పారు. ఇది అక్షరాలా నిజం. నేను నా బిడ్డలపై ఒట్టేసి చెబుతున్నాను. నిజం కాదని వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ జగన్ రెడ్డి వాళ్ల బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పగలరా? నా మేలు కోరుతానని మాటిచ్చిన జగన్ ఇప్పుడు ఎందుకిలా చేస్తు్న్నారు. నా బిడ్డలు మీ ముందే పెరిగారు కదా వారికి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది? అని షర్మిల ప్రశ్నించారు. నాడు జగన్ తప్పించుకోవడానికి సీబీఐ ఎఫ్ఆర్లో వైఎస్సార్ పేరు.. నేడు లబ్ధి కోసం తల్లిని వాడుకుంటున్నారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.