వైసీపీ నుంచి విడుదల.. జనసేనలోకి రజిని!
అవును.. మీరు వింటున్నది నిజమే. వైసీపీ హయాంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మంత్రి విడదల రజిని ఓ వెలుగు వెలిగారు! అధికారం పోయేసరికి ఆ వెలుగు మొత్తం ఆరిపోయింది! దీంతో పక్కచూపులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు కొన్ని కేసులు కూడా వెంటాడుతుండటం, ఆర్థికంగా, వ్యాపార పరంగా అన్ని విధాలుగా సపోర్టు కావాలని భావిస్తున్న రజినీ వైసీపీ నుంచి విడుదల కావాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఓ మాజీ మంత్రి ద్వారా రాయబారం నడిపినట్లుగా సమాచారం. ఇంతకీ ఎవరా మంత్రి? ఇందులో నిజానిజాలెంత? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు.. ఏమైంది?
2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ, 2024 ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది. ఎంతలా అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. దీంతో పార్టీ పరిస్థితేంటన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే రెండ్రోజలకో వివాదం, వైఎస్ ఫ్యామిలో వేర్వేరు కుంపట్లు, గొడవలతో, ఆస్తి వివాదాలతో రచ్చ రచ్చగానే మారిపోయాయి. ఇవన్నీ వైసీపీకి పెద్ద మైనస్లుగా మారిపోయాయి. సొంత చెల్లిని పట్టించుకోని, న్యాయం చేయని వైఎస్ జగన్ రెడ్డి, ప్రజలకు ఎలాంటి న్యాయం చేయగలరు? అనే ఒక మెసేజ్ జనాల్లోకి గట్టిగా వెళ్లిపోయింది. దీంతో ఇప్పట్నుంచే తిన్నగా సర్దుకోవాలని నేతలు ఒక్కొక్కరుగా జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య, కీలక నేతలు జంప్ అవ్వగా.. మరికొందరు అదే బాటలో నడుస్తున్నారు. ఇందులో విడదల రజిని కూడా ఒకరు. నెక్స్ట్ వైసీపీకి రాజీనామా చేసేది రజినీ అంటూ వైసీపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం గమనార్హం.
పవన్ ఏమంటారో?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రజినీ.. ఈ మధ్యనే వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి, సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. పవన్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా? అని వైసీపీ నుంచి ఎప్పుడు విడుదల అవుదామా అని రజిని ఎదురుచూపుల్లో ఉన్నారట. ఇదే జరిగితే వైసీపీకి బిగ్ షాకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థికంగా, రాజకీయంగా, యూత్‌లో మంచి క్రేజ్ అన్ని విధాలుగా బలంగా ఉన్న వారిలో విడుదల ఒకరు. ఎందుకంటే విదేశాల్లో ఐటీ కంపెనీలు, వ్యాపారాలు.. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి ఆదరణ, దీనికి తోడు మొదటిసారి గెలిచి.. మంత్రి పదవి దక్కించుకున్నారు.
ఎందుకనీ..?
ఇవన్నీ ఒకఎత్తయితే సీనియర్ నేతలను సైతం పక్కనెట్టి మరీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు జగన్. అలాంటిది ఇప్పుడు వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలతో కార్యకర్తలు, అభిమానులు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసిన తమరికి, అధికారం పోయేసరికి ఎందుకిలా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. రెండ్రోజులుగా నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది కానీ, ఎక్కడా ఆమె రియాక్ట్ అయిన దాఖలాల్లేవ్. అయితే కొత్తగా పార్టీలో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ పాత వారిని, మాజీలను పట్టించుకోవట్లేదని అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో రజిని చెప్పుకుని కాస్త మదనపడ్డారట. పార్టీ పరిస్థితి సరిగ్గా లేకపోవడం, తగిన గుర్తింపు లేకపోవడంతో ఇక జనసేనలోకి జంప్ కావాలని, త్వరలోనే భవిష్యత్ ప్రకటించాలని విడదల ఫిక్స్ అయ్యారట. వాస్తవానికి రజిని జంప్ అవుతారనే వార్తలు రావడం కొత్తేమీ కాదు.. ఆ మధ్య ఇలానే వార్తలు రావడం, జగన్ వినుకొండ పర్యటనలో ప్రత్యక్షమవ్వడంతో వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ఈసారి ఏమవుతుందో.. ఏం జరుగుతోందో చూడాలి మరి.