విశ్వంవాయిస్ న్యూస్, రాజోలు
అట్రాసిటీ చట్టాలపై అవగాహన సదస్సుకు
మండల స్థాయి అధికారులు గైర్హాజరు
రాజోలు విశ్వం వాయిస్ న్యూస్ :-ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ప్రతీనెలాఖరు తారీఖున గ్రామాల్లో సివిల్ రైట్స్ డే ను పురస్కరించుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై మండల స్థాయి అధికారులు అవగాహన కల్పించాల్సిన సదస్సుకు గైర్హాజరు కావడం పట్ల దళిత నాయకులు అసహనాన్ని వ్యక్తం చేశారు.ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి సురేష్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు రాజోలు తాసీల్ధార్ కార్యాలయం నుండి సినీయర్ అసిస్టెంట్ సిహెచ్ కుమారి దేవి, ఎంపిడివో కార్యాలయం నుండి ఏవో మామిడిశెట్టి సత్యనారాయణ హాజరయ్యారు.ఈ సమావేశానికి హాజరై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించాల్సిన రాజోలు పోలీస్ వారు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ హాజరుకాకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పౌర హక్కులపై అవగాహన కల్పించారు.అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు అవగాహన సదస్సులపై చిన్నచూపు చూడటం తగదని రాజోలు జేఏసీ కన్వీనర్ మట్టా సురేష్ కుమార్ అన్నారు. అట్రాసిటీ చట్టాల అవగాహన సదస్సులను విస్మరిస్తున్న అధికారులపై జిల్లా కలక్టర్ తో పాటుగా ఎస్సీ కమిషన్ కు పిర్యాదు చేస్తామని దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో విఆర్వోలు సత్తిబాబు,పంచాయతీ కార్యదర్శి రజని,జేఏసీ నాయకులు మందపాటి మధు,మెడబల శేఖర్ , ఉప సర్పంచ్ బొక్కా రామకృష్ణ,తులా సత్యనారాయణ,రావి రాజారావు,పాముల సత్యనారాయణ రాపాక శ్రీరామూర్తి,కలిగితి త్రీమూర్తులు తదితరులు పాల్గొన్నారు.