ఈ దీపావళికి స్టార్ హీరోలెవరూ బాక్సాఫీసు దగ్గరకు రాకపోయినా.. యంగ్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోలు బాక్సాఫీసు దగ్గర పోటీకి రెడీ అయ్యారు. నేడు దివాళి సందర్భంగా మలయాళ హీరో దుల్కర్, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన లక్కీ భాస్కర్, కుర్ర హీరో హీరో కిరణ్ అబ్బవరం నటించిన క చిత్రంతో పాటుగా శివ కార్తికేయన్ అమరన్ అలాగే బఘీర చిత్రాలు విడుదలయ్యాయి.
మొదటి నుంచి లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటుగా అమరన్ పై కూడా అంచనాలు కనిపించాయి. మిడ్ రేంజ్ హీరోలైనా ప్రమోషన్స్ విషయంలోను పోటీపడ్డారు. ఇక లక్కీ భాస్కర్, క చిత్రాలు గత రాత్రే ప్రీమియర్స్ తో సందడి చేసాయి. సితార నాగవంశీ ఈ మధ్యన తన సినిమాలకు బ్యాడ్ రివ్యూస్ ఇస్తారని కనీసం ప్రెస్ కి షో కూడా వెయ్యడం మానేసాడు. అలాంటిది నాగవంశీనే లక్కీ భాస్కర్ ని ప్రీమియర్స్ కి దించాడంటే ఆ సినిమాపై ఎంత నమ్మకం ఉండాలి.
ఆ నమ్మకాన్ని లక్కీ భాస్కర్ నిలబెట్టుకుంది. వెంకీ అట్లూరి మేకింగ్, దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, కొన్ని ట్విస్ట్ లు అదిరిపోయాయంటూ లక్కీ భాస్కర్ ప్రీమియర్ చూసిన వాళ్ళు చెబుతున్నమాట. దీపావళి రేస్ లో లక్కీ భాస్కర్ విన్ అయినట్లే అని తెలుస్తోంది. మరోపక్క తన సినిమాపై కాన్ఫిడెంట్ తో కిరణ్ అబ్బవరం కూడా క ని ప్రీమియర్స్ కి దించాడు.
క చిత్రం చూసిన వారంతా బావుంది అంటూ యునానమస్ గా చెబుతున్న మాట. క కథ అదిరిపోగా.. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ హైలెట్, అలాగే BGM వేరే లెవల్, ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్ అంటూ క ప్రీమియర్స్ చూసిన వారు చెబుతున్నమాట. సో ఈ దివాళి పరీక్షలో క కూడా పాసైపోయింది.
ఇక అమరన్ కు కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. మరి బఘీర మాటేమిటో తెలియాల్సి ఉంది.