మాదిగలు మాదిగ ఉపకులాలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
నవంబర్ 21వ తేదీన రాజమహేంద్రవరంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ, ఎమ్మార్పీఎస్ కోస్తా జిల్లాల కన్వీనర్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ , ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి మాదిగ లు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం బైపాస్ రోడ్ లోని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కమిటీ హాల్ లో ఎమ్మార్పీఎస్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ నవంబర్ 2 తేదీన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ రాజమహేంద్రవరం పర్యటన రద్దు అయిందని తెలిపారు. నవంబర్ రెండో తేదీన జరగవలసిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం సభ 21వ తేదీన జరుగుతుందని తెలిపారు. నవంబర్ 21వ తేదీన రాజమండ్రి షెల్టన్ హోటల్ నుంచి పాదయాత్ర ప్రారంభమై గోరక్షణ పేట శారద నగర్ ఆంధ్ర నగర్ సిమెంట్రిపేట తదితర ప్రాంతాల నుంచి ఊరేగింపుగా గోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆనం కళా కేంద్రం చేసుకుని అక్కడ మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ జరుగుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరిగిన తరువాత మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం విచ్చేస్తున్న మన్యశ్రీ మందకృష్ణ మాదిగ కు మాదిగ మాదిగ, మాదిగ ఉప కులాలు ఘన స్వాగతం పలకాలని పిలుపు ఇచ్చారు. మాదిగలు విభేదాలు పక్కన పెట్టి మాదిగ విద్యార్థి సంఘాలు, మాదిగ ఉద్యోగ సంఘాల నాయకులు, మాదిగ మహిళ సంఘాల నాయకులు, ఇతర విభాగాల నాయకులు ఒక్క తాటిపైకి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాదిగ డప్పులు, డీజేలు, ఇతర కళాకారులతో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా , పశ్చిమగోదావరి జిల్లా కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మాదిగలు తరలి రావాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తర కోస్తాల జిల్లాల కన్వీనర్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగలు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి మాదిగ.ఉమ్మడి జిల్లాల ఎం ఈ ఎఫ్ అధ్యక్షులు తాతపూడి వెంకటేష్. ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొల్లు శ్యామ్ సన్ ,ఎం ఎల్ ఎఫ్ జాతీయ నాయకులు కొత్తపల్లి ప్రసాద్,ఎం ఈ ఎఫ్ నాయకులు చంద్రమల్ల రాజు మాస్టర్, ధూళి జయరాజ్,టౌన్ ప్రెసిడెంట్ తోలేటి రాంప్రసాద్ మాదిగ కో కన్వీనర్ రాచర్ల సుధాకర్,ఎం ఎస్ పి టౌన్ ప్రెసిడెంట్ వైరాల రమేష్ మాదిగ,కూరాకుల రాజు మాదిగ, లిల్లీ మాదిగ,సామ్యూల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.