WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

Anita reaction on Pawan comments పవన్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU


Tue 05th Nov 2024 12:58 PM

anita  పవన్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్..


Anita reaction on Pawan comments పవన్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్..

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం వేదికగా రాష్ట్రంలో శాంతి భద్రతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. హోం మంత్రి వంగలపూడి అనితపై ఘాటుగానే కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చిత్ర విచిత్రాలుగా అర్థం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా, మీడియా వేదికగా అనితకు పదవీ గండం అంటూ పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి. అంతే కాదు కూటమి ప్రభుత్వంలో ఏదో తేడా కొడుతోంది అని కూడా కామెంట్స్ వచ్చిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంపై అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న అనిత గట్టిగానే స్పందించారు.

అబ్బే అదేమీ లేదు!

పవన్‌ కల్యాణ్‌ మాటలను పాజిటివ్‌గా తీసుకుని, బాధ్యతగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గంజాయి వంటి అంశాలను ఏమాత్రం ఉపేక్షించమని హెచ్చరించారు. నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కీలకంగా చర్చించామని తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛ పేరిట కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్‌ ఆవేదనతో అలా మాట్లాడారని వివరించారు. గతంలో వైసీపీ చేసిన వికృత చేష్టలను వివరిస్తూ.. తాను సోషల్‌ మీడియా బాధితురాలినే అంటూ అనిత కంటతడి పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ కొందరు రాబందుల్లా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

పవన్ ఓపెన్ అయ్యారు..!

ఆంధ్రాలో జరుగుతున్న నేరాల విషయంలో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోందని.. ఐతే డిప్యూటీ సీఎం పవన్‌ బయటపడ్డారు.. మేము పడలేదన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ పకడ్బందిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై సున్నితంగానే అనిత మాట్లాడారు. ఐతే ఇప్పుడు జరుగుతున్న నేరాలు, ఘోరలకు గత ప్రభుత్వమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన బాధాకరమన్నారు. ఐతే గతంలోనే ఇలాంటి ఘటనల విషయంలో కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇలాంటి కేసుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని.. వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులు కావాలన్నారు. ఈ అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మీడియాకు వివరించారు. దీంతో పాటు సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కూడా ఉంటాయని.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదంటూ అనిత అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ర్స్. 


Anita reaction on Pawan comments:

Home Minister Anita reacted to Pawan comments





advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement