మందకృష్ణ మాదిగ అధికారి ప్రతినిధి నేదునూరి రాజేష్ మాదిగ…
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం
హలో మాదిగ చలో రాజమహేంద్రవరం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మందకృష్ణ అధికారి ప్రతినిధి నేదునూరి రాజేష్ మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన రాయవరం దళితవాడలో గ్రామ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగకు ఘనంగా స్వాగతిస్తూ కరపత్రాన్ని విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ అధికార ప్రతినిధి రాజేష్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర జనాభాలో 10 శాతం,తెలంగాణ రాష్ట్ర జనాభాలో 16 శాతం మాదిగలున్నారని,విద్యా ఉద్యోగ రంగాలలో తమ వాటా కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్) ని మంద కృష్ణ మాదిగ స్థాపించాడు. జాంబవ పురాణం ప్రకారం మాదిగలు మొదటి వారు, మొదటి రాజులు అని జాంబపురాణంలో చెప్పబడిందన్నారు. మాదిగ కులం చారిత్ర పరంగా అట్టడుగుస్థాయిలోనికి అణచివేయబడిందని, ప్రస్తుతం వారి సాంఘిక ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావంవల్ల మెరుగుపడింది.దళిత ఉద్యమకారుడు లెల్లే సురేశ్ ఈ కులం గురించి 2004లో తీసిన డాక్యుమెంటరీ చిత్రం మహాదిగ విమర్శనాత్మకంగా ప్రశంసలు పొందిందని ఈ సందర్బంగా తెలియజేసారు. 1994లో మంద కృష్ణ మాదిగ మరియు దండు వీరయ్య మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని రాజ్యాంగ కులాలకు రాష్ట్ర కేటాయింపులను సమానంగా పంపిణీ చేసేలా ఎస్సీ రిజర్వేషన్ కోటాను వర్గీకరించాలని డిమాండ్ చేశారన్నారు. మాదిగ దండోరా ఉద్యమంగా ప్రసిద్ధి చెందిన ఈ ఉద్యమం, షెడ్యూల్డ్ కులాల వర్గంలో ఉప వర్గీకరణ డిమాండ్ కోసం ప్రచారం చేయడానికి ధర్నాలు,సామూహిక ర్యాలీలు,రైల్ రోకోలు మరియు అనేక మార్గాలు ద్వారా తెలిపారు.మాదిగ సంఘం మరియు ఇతర అట్టడుగు దళిత ఉప సమూహాలు.ఎస్సి వర్గంలో పెరుగుతున్న అసమానతల కారణంగా ఈ డిమాండ్ ఏర్పడిందని,కొన్ని సంఘాలు ఇతరుల కంటే ఎక్కువ విద్యా మరియు ఉపాధి అవకాశాలను కలిగి ఉన్నాయని,మాదిగ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ఇతర చిన్న అట్టడుగు వర్గాలను కూడా ఏకం చేసిందని,వీటిని తరచుగా ఉపగ్రహ కులాలు అని పిలుస్తారని,వారు ఇలాంటి సామాజిక-ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటారని అందువలన ఈ ఉద్యమం యొక్క ద్వైపాక్షిక విధానం,దాని డిమాండ్ల కోసం వివిధ రాజకీయ పార్టీలతో నిమగ్నమై,మద్దతు మరియు విమర్శలు రెండింటినీ ఆకర్షించిందని వివరించారు. అనంతరం ఎమ్ ఆర్ పి ఎస్ వ్యస్థాపకఅధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రం తో ముద్రించిన అన్న వస్తున్నాడు బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డోకుబుర్ర రాజబాబు మాదిగ, మాదిగ లాయర్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు దూలి జయ రాజు మాదిగ,బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క శేషు మాదిగ,కార్యదర్శులు దార్ల సతీష్ కుమార్ మాదిగ,లంకా చందు మాదిగ,రాయవరం మండలం నాయుకులు చంద్రమళ్ళ సంజీవ్ రాజు మాదిగ,లంక శ్రీను మాదిగ,దొండపాటి లక్ష్మణ రావు మాదిగ,గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ మాదిగ,రాయవరం మండలం గ్రామ కమిటీ సభ్యులు, యువ చైతన్య సభ్యులు సంఖ్యలో పాల్గొన్నారు.