నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ(balakrishna)కెరీర్ పరంగా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు.తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకి సంబంధించిన పనుల్ని తనే దగ్గరనుండి చూసుకోవడమే కాకుండా,తన అప్ కమింగ్ చిత్రమైన ‘డాకు మహారాజ్'(daku maharaj)షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నాడు.ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12 న విడుదల కాబోతుంది.
దీంతో అతి త్వరలోనే ‘డాకు మహారాజ్’ షూటింగ్ ని బాలయ్య కంప్లీట్ చెయ్యబోతున్నాడు.ఆ తర్వాత ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా వెంటనే ‘అఖండ 2 ‘షూటింగ్ ని కూడా స్టార్ట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది.డిసెంబర్ రెండో వారంలో బాలకృష్ణ తో పాటు చిత్ర ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనేలా దర్శకుడు బోయపాటి ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇక మోక్షజ్ణ మూవీ కూడా డిసెంబర్ మధ్య నుంచే షూటింగ్ దశలోకి అడుగుపెట్టబోతుందని, ఈ మేరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతుందని అంటున్నారు.
ఈ విధంగా తండ్రి, కొడుకులిద్దరు డిసెంబర్ నెలలోనే షూటింగ్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ ని తీసుకొచ్చారు.పై పెచ్చు బాలయ్య,మోక్షజ్న సినిమాలకి ఒకే రకమైన ప్రత్యేకత ఉంది.అదేంటంటే బాలయ్య, మోక్షజ్ఞ చిత్రాలు రెండు కూడా ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన కథలతో తెరకెక్కుతున్నాయి.అఖండ 2(akhanda 2)ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన మూవీ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు మోక్షజ్ఞ మూవీ కూడా మైథలాజికల్ మూవీగా తెరకెక్కబోతుంది. ఈ విషయాన్నీ దర్శకుడు ప్రశాంత్ వర్మ(prashanth varma)అధికారంగా వెల్లడి కూడా చేసాడు. ఇక ఈ రెండు చిత్రాలకి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.