బంధాలు బలహీనమయ్యాయి, విడాకులంటే ఫ్యాషన్ అయిపొయింది.. దశాబ్దాలుగా పెళ్లి బంధంలో ఎన్నో కాంప్రమైజ్ లు, మరెన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు అన్నిటికి మించిన ఆనందంతో పెనవేసుకున్న బంధాలకు ప్రతీకగా పిల్లలు. కానీ ఇప్పుడు ఆ బంధాలు బందీగా మారాయి. అందుకే విడాకుల పేరు చెప్పి విడిపోతున్నారు కొందరు.
పెళ్లయ్యాక నాలుగైదేళ్లకు విడిపోయారంటే మెచ్యూరిటీ లేదు అనుకోవచ్చు. కానీ పెళ్ళయ్యి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు సంసారం జీవితాన్ని గడిపిన తర్వాత విభేదలు రావడం, కాంప్రమైజ్ కాలేకపోవడం తో ఆ బంధాలు విడాకుల వైపు మళ్లుతున్నాయి. పిల్లల కోసం ఆలోచించడం లేదు, తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను పొందేందుకు ఆ హృదయాలు ఎంతగా తల్లడిల్లుతున్నాయో అర్ధమవుతుందా? బర్త్ డే లకు, లేదంటే స్పెషల్ అకేషన్స్ కో కలిసి తర్వాత బై బై చెప్పెయ్యడం ఎంతవరకు కరెక్ట్.
ఒకరికి ఒకరు అర్ధం కాకపోవడం, ఒకరిని ఒకరు అర్ధం చేసుకోకపోవడం, ఇద్దరి మద్యన మూడో వ్యక్తి ప్రవేశించడం, ఆర్ధిక సమస్యలు, ఫ్యామిలీ ప్రోబ్లెంస్ తో విడాకులు తీసుకునేవారిని చూస్తుంటాము. ఇప్పుడు కోలీవుడ్ లో ఎక్కువగా విడాకుల ట్రెండ్ కనిపిస్తుంది.
అందులో 18 ఏళ్ళు కాపురం చేసిన ధనుష్-ఐష్వర్య విడిపోవడమే షాకింగ్ అనుకుంటే, జయం రవి-ఆర్టీలు పిల్లలు పెద్దవారయ్యాక విడిపోవడం, ఇప్పడు 30 ఏళ్ళ సంసారం జీవితానికి రెహమాన్ -సైరా భాను స్వస్తి చెప్పడం ఇదంతా ఏమిటి, ఎందుకు అనేది అర్ధం కాక వాళ్ళ అభిమానూలు జుట్టు పీక్కుంటున్నారు.
మరి ఇది తొందరపాటు నిర్ణయం అని చెప్పలేము, అన్నేళ్ల వైవాహిక జీవితంలో ఇలాంటి ఓ నిర్ణయం తొందరపాటు అవ్వదు, కానీ కలిసి కాంప్రమైజ్ అవ్వలేక ఇలాంటి నిర్ణయాలు తీసుకుని బాధపడుతూ, బాధపెడుతూ కొంతమంది ముందుకు సాగుతున్నారు.