WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

కిమ్స్ లో అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రాష్ట్రంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఓ.సీ.టీ, రొటాబ్యులేషన్ ద్వారా గుండె చికిత్సలు..

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం,విశ్వంవాయిస్ న్యూస్:ఎన్నో ఉన్నత అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులో ఉంచిన రాజమండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ ) ఆధారంగా చేసే ఓ.సి.టి వైద్య చికిత్స కూడా అందుబాటులోకి తెచ్చినట్లు కిమ్స్ సీఈవో,ఛీఫ్ కార్డియాలజస్ట్ డాక్టర్ ఎన్.రామరాజు చెప్పారు. ఇది రాష్ట్రంలోనే తొలిసారి రాజమండ్రిలో ఈ విధానం అందుబాటులో ఉందని తెలిపారు.కార్డియాలజి సర్జన్ డాక్టర్ సతీష్, కార్డియాలజిస్టులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ ఫణి తేజ, డాక్టర్ రేవంత్ డాక్టర్ చెన్నకేశవ మరియు కార్డియాక్ సర్జన్ డాక్టర్ పుష్యమి తదితరులతో కలసి హోటల్ షెల్టాన్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001లో బొల్లినేని కిమ్స్ ప్రారంభించి, యాంజియోగ్రామ్, బైపాస్ సర్జరీ, రోటా బ్లషన్ వంటివి చేయడానికి ముందుకొస్తే చాలామంది ఆశ్చర్యపోయారని,హైద్రాబాద్, బెంగుళూరులకు వెళ్లిపోతామని అన్నపుడు పేషేంట్స్ లో అవగాహన పెంచి ఇక్కడే ఆపరేషన్లు చేయడం ప్రారంభించామని డా.రామరాజు గుర్తుచేసుకున్నారు.తర్వాత కాలంలో డా సతీష్ చేరారని, హాస్పిటల్ లో ఇప్పటివరకు చేసిన ఆపరేషన్స్ లో 13వేల సర్జరీలు డా.సతీష్ ఒక్కరే చేసి రికార్డు నెలకొల్పారని తెలిపారు. స్టెంట్స్ వేయడం, ఆపరేషన్లు చేయడం, బ్లాక్స్ ని క్లియర్ చేయడం ఇలా ఎన్నో వైద్య విధానాలతో పేషేంట్స్ కి మంచి చికిత్స అందిస్తూ వస్తున్న కిమ్స్ ఇప్పుడు మరిన్ని కొత్త వైద్య విధాలను అందుబాటులోకి తెచ్చినట్లు డాక్టర్ రామరాజు వివరించారు.

సాధారణంగా వందమందిలో ఒక్క గుండె వ్యాధిగ్రస్తుడికి అయోర్టిక్ చాలా సన్నగా ఉంటుందని,అటువంటి గుండె వ్యాధిగ్రస్తులకు కూడా వాల్వు లు రీప్లేస్మెంట్ చేసి రూట్ డైలేషన్ ప్రొసీజర్ ద్వారా ఇప్పటికీ పదిమంది గుండె వ్యాధిగ్రస్తులకి పైగా విజయవంతంగా అమర్చినట్లు డాక్టర్.రామరాజు చెప్పారు.అలాగే అయోర్టిక్ వాల్, అసెండింగ్ అయోర్ట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్లు (బెంటల్ ప్రొసీజర్) హైదరాబాద్ లో మాత్రమే అందుబాటులో ఉండేదని అయితే ఈ ఆధునిక చికిత్స ఇప్పుడు కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ లో కూడా అందుబాటులో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నామని ఆయన అన్నారు.బ్రెయిన్ స్ట్రోక్ , పునరావృత్త బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సకు అవసరమైన కరోటేడ్ ఎండర్ట్రెక్టమీ ప్రొసీజర్ కొంతమందికే అవసరపడే ఈ వైద్య విధానంతో దాదాపు 60 మంది వ్యాధిగ్రస్తులకు దిగ్విజయంగా చికిత్సలు అందించి,మెరుగైన జీవితాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. అత్యాధునిక వైద్య విధానాలని రాజమండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉంచినందున వినియోగించుకోవాలని డాక్టర్ రామరాజు కోరారు.ఈసందర్బం గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గుండె రక్తనాళాలను శుద్ధిచేసి,స్టెంట్స్ ఎలా వేస్తారో, రక్తనాళాలు పగిలిపోయినపుడు, ఉబ్బినపుడు ఎలాంటి చికిత్స అందిస్తున్నామో వివరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement