WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

రాష్ట్రానికి కేంద్రం నిధులు మోడీ సర్కార్ సొంత రాజకీయ అవసరాల కోసమేనా… మేడా శ్రీనివాస్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కార్పొరేట్ మీడియా వార్తలతో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందట ..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని పవన్ కళ్యాణ్ ప్రకటనలో నిజముందా !

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ కు కార్పొరేట్ మీడియా ప్రచార నిధులు వద్దు – నిజమైన నిధులు కావాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అదే కార్పొరేట్ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు ..

 

కొన్ని కార్పొరేట్ మీడియా వార్తల కధనాలతో ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందంటు పుంకాను పుంకాలుగా వార్త కధనాలతో ఆశలు కల్పిస్తున్నాయని , వాస్తవానికి కేంద్రం నిధులు మోడీ సర్కార్ సొంత రాజకీయ అవసరాలు మేరకే విడుదల చేస్తున్నారని ,ఆ నిధులు గ్రాంట్ గా వచ్చినవా ! ఋణంగా విడుదల చేసినవా అనేది నేటికి స్పష్టత లేకుండా పోయిందని , నేతల రాజకీయ అవసరాలకు చేస్తున్న అప్పులు మాత్రం ఆంధ్రుల నెత్తిపై మోయలేని భారంగా వుంటుందని,ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క అభివృద్ధి లేకపోయినా వడ్డీగా సుమారు 100 కోట్లు పైభడి కడుతున్నారని కాకి లెక్కలు హల్ చల్ చేస్తున్నాయని ,ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నేటికి సరైన లెక్కలు లేని విధంగా సుమారు 15 వేల కోట్లు పైభడి అప్పులు చేసినట్టు చెప్పుతున్నారని ,కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పే లెక్కలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే అప్పుల లెక్కలకు అస్సలు పొంతన లేకుండా పోయిందని , అప్పుల ముసుగులో దోపిడి జరుగుతుందని,అప్పులతో ఆంధ్రులు మోయలేని బారంతో తరాలు అంతరించి పోతున్నాయని,కొన్ని కార్పొరేట్ మీడియా వార్త కధనాలు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో నిజం చచ్చిపోతుందని ,అబద్దాలే నిజాలుగా ప్రచారంలో వుంటున్నాయని,ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అంటు వార్తలు వ్రాస్తున్న కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థలు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఎలా వెలిగి పోతుందో చెప్పాలంటున్నారని,బూజు వార్త కధనలతో రాష్ట్ర భవిష్యత్ కు కార్పొరేట్ మీడియా సంస్థలు శాపంగా మరాయని ఆయన ఆవేదన చెందారు.

 

ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీల్లో భాగంగా చట్ట బద్ధమైన హక్కు ప్రత్యేక హోదా -విభజన హామీలు అమలును సాధించకుండా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన విభజన నష్టం ఏ విధంగా భర్తి అవుతుందని , మోడీ సర్కిర్ ఆంధ్రప్రదేశ్ నుండి విలువైన లక్షల కోట్లు సంపదను దోచుకు పోతుంటే రాజకీయ బలహీనతలతో ఆంధ్రప్రదేశ్ పాలకులు మోడీకి బాంచన్ అంటు కాళ్ళు మ్రోక్కుతున్నారని , కేంద్రం నుండి రావలసిన బకాయిలను సాధించటంలో అసమర్ధతను చాటుకుంటు ఆంధ్రప్రదేశ్ లో తొడలు చరుస్తున్నారని,కొంతమంది ఈ జీరో నేతలను ,సినిమా హీరోలను కిరాయి వార్త కథనాలతో వారి ఫోటో లను కార్పొరేట్ మీడియా పెద్దగా చేస్తు గాలి వార్తలు వ్రాస్తున్నారని,కార్పొరేట్ మీడియా కధనాలతో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉపాధి మార్గాలు అడుగంటి పోతున్నాయని, అభివృద్ధి శూన్యంగా మారిందని, మన ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపిలు ప్రజల కోసం,సమాజం కోసం కాకుండా బందిపోటు దొంగలు వలే ప్రజల శ్రమను , బావితరాల భవిష్యత్ ను దోచుకుంటున్నారని ,పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కు అమలు కావాల్సిన చట్టభద్దమైన ప్రత్యేక హోదా – విభజన హమీల హక్కును సాధించే దమ్మున్న పార్లమెంట్ సభ్యులు కోసం ఆంధ్రులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని ,విభజన హామీలు అమలు కాకుండా ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్ ఉంటుందా !అనే కనీస జ్ఞానం లేని మూర్కులు నేడు మనకి పాలకులుగా చలామణి అవుతున్నారని ,ఆంధ్రులు ప్రత్యేక హోదా -విభజన హామీలను, రావాల్సిన రెవిన్యూ బకాయిలను సాధించుకునే తిరుగుబాటు ముందు ముందు వుందని ఆయన హెచ్చిరించారు.

 

దశాబ్దల నుండి పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ను సాధించుకోలేని మన పాలకులు విజయవాడ నుండి విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ సాధించామంటు కార్పొరేట్ మీడియా వార్త కధనాలతో ఆంధ్రులను మరోసారి మోసం చేస్తున్నారని , ఆంధ్రులకు కార్పొరేట్ మీడియా ప్రచార నిధులు వద్దని , నిజమైన అభివృద్ధి నిధులు కావాలని , కేంద్రం తోపాటుగా ఆంధ్ర రాష్ట్ర పాలకులు ఆంధ్రులను నిరంతరం మోసం చేస్తున్నారని , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వుండగా విజన్ 2020 అని నేడు విజన్ 2047 లక్ష్యం అంటు ఆంధ్రుల చెవుల్లో క్యాబేజి పూలు పెడుతున్నారని , 2020 పేరుతో నేటికి అర్ధ శతాబ్దం పాటు తరాలు భవిష్యత్ ను కోల్పోయారని ,నేడు 2047 అంటు మరో 100 ఏళ్ల భవిష్యత్ ను నాశనం చేయటమే లక్ష్యంగా కూటమి సర్కిర్ ఆంధ్రులను మాయ చేస్తుందని,నకిలీ సరుకులు,విత్తనాలతో ప్రజల ఆరోగ్యాలు క్షీణదశ కు చేరుకుంటుంటే అందరికి ఆరోగ్యంతో బాటుగా సంపద నిస్తాం అంటు మతి చెలించిన మోసానికి మార్గం చేసుకుంటున్న కూటమి సర్కార్ తో అనేక ప్రమాధాలు ముంచుకోస్తాయని ఆయన హెచ్చిరించారు.

 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు అని కొన్ని సొంత కార్పొరేట్ మీడియా సంస్థల ద్వారా కిరాయి వార్తలను ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రి హోదా అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ మతి చలించిన ప్రకటనలు చేయటం అర్ధవంతంగా వున్నాయని,కేంద్రం నిర్లజ్జగా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తాం,ప్రత్యేక హోదా,విభజన హామీలను ఇవ్వటం కుదరదు అని కరాకండిగా చెబుతుంటుంటే పవన్ కళ్యాణ్ ఎవరిని మోసం చేయటానికి విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదని అబద్దపు ప్రకటనలు చేస్తున్నారని,పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి వుంటే ప్రత్యేక హోదా, విభజన హమీల పైన,ఉక్కు కర్మాగారంపైన మోడీ సర్కార్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు ప్రకటన చేయించాలని , ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టం సెక్షన్ 13 లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ వుందని అందుకే తోలుత 42 వేలకోట్లతో ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వలే ఘోరమైన అబద్దాలు చెప్పుకోవటం పవన్ కళ్యాణ్ కే చెల్లిందని ,రీ ఆర్గనైజేషన్ చట్టంలో విభజన నష్టానికి సంబంధించి ప్రత్యేక హోదా విభజన హామీలతో పాటుగా అనేక అంశాలు వున్నాయని , మోడీ సర్కార్ కు లాభం చేకూరే అంశాలపై ఒక విధంగాను, రాష్ట్రానికి మేలు జరిగే అంశాలపై మరో రకంగాను మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా హెచ్చిరించారు.

 

సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.

 

ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ సిమ్మా దుర్గారావు,ఎం.డి హుస్సేన్, వర్ధనపు శరత్ కుమార్,ఆకుల మణికాంత్,గుడ్ల దుర్గాప్రసాద్, బసా సోనియా,వల్లి శ్రీనివాస రావు,సుంకర వెంకట భాస్కర రంగారావు,బత్తెన శివన్నారాయణ,మాసా అప్పాయమ్మ,మసా రాజులమ్మ , నాగురి అన్నపూర్ణ,సింహాద్రి తిలక్,బంకపల్లి సత్తిబాబు, పసుపులేటి వీర్రాజు,మాసా బాబీ, బండి అతిధి,కందుల వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

రాష్ట్రానికి కేంద్రం నిధులు మోడీ సర్కార్ సొంత రాజకీయ అవసరాల కోసమేనా…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement