వార్షికోత్సవ వేడుకలు…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:
ఐ.పోలవరం – విశ్వం వాయిస్ న్యూస్:
ఐ.పోలవరం మండలం గుత్తినదీవి గ్రామంలో శ్రీ సాయి రామ్ విద్యానికేతన్ స్కూలు 23 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా సంస్థగా స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తీర్చిదిద్దుతున్నారు. ఈ స్కూల్ నుండి ప్రతిసంవత్సరం నవోదయ ఎంట్రన్స్ పరీక్షలలో అత్యధికంగా ఉత్తీర్ణత పొందుతుంటారు. ప్రదర్శనలో భాగంగా ఈ రోజు నిర్వహించినటువంటి వార్షికోత్సవంలో పిల్లలందరూ ప్రముఖులను సైతం అబ్బురపరిచే విధంగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టువంటి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో కూడా విద్యార్థులందరికి చక్కని చదువు క్రమశిక్షణ నేర్పుతూ సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ నాయకులు యొక్క వేషధారణ విప్లవ వీరుల యొక్క చరిత్ర జానపద గేయములు సమాజం పట్ల విలువలు ఇటువంటివన్నీ కూడా పిల్లలకి శిక్షణ ఇస్తున్నట్టుగా వారి ప్రదర్శన ద్వారా తెలుస్తుంది ఇటువంటి చక్కని విద్యని అందిస్తూ మంచి పౌరులుగా తీర్చి దిద్దుతున్నటువంటి కరస్పాండెంట్ శ్రీనివాస రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.
ఆర్ ఎస్ ఎస్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ జగదీష్ గారు మాట్లాడుతూ నేటి విద్యా సంస్థలు చదువు ఒక్కటే ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఈ రోజుల్లో చదువుతోపాటు చక్కని సంస్కృతి సాంప్రదాయాలు వారికి మంచి సంస్కారాలు విజ్ఞానం సమాజంలో నైతిక విలువలు దేశం పట్ల భక్తి శ్రద్ధలు కలుగ చేస్తూ ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ సమాజంలో మంచి పౌరులను తీర్చి దిద్దుతూ చక్కటి స్కూలు నిర్వహిస్తున్నటువంటి ఈ సాయిరాం స్కూల్ ను మరింత అభివృద్ధి పధంలోకి తీసుకుని వెళ్లడం మనందరి బాధ్యత అని ప్రతి ఒక్క తల్లిదండ్రులను వారు కోరడం జరిగింది .
స్థానిక సర్పంచ్ సుదర్శన్ సర్పంచ్ శ్రీమతి ముదునూరి పద్మ కృష్ణార్జున రాజు మాజీ జెడ్పిటిసి సభ్యులు
పేరాబత్తుల రాజశేఖర్ ఎంపిటిసి శ్రీమతి చోడిశెట్టి జ్యోతి సత్తియ్య నాయుడు శ్రీమతి లంకలపల్లి దుర్గా రాణి జమ్మి సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మప్రచాక్
బొంతు కనకారావు రెల్లు గంగాధరం మద్దింశెట్టి పురుషోత్తం మోర్త ధర్మరాజు. బి లక్ష్మీనారాయణ
విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు