Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మండలానికి ప్రత్యేక అధికారి ఏ . చంద్రపాల్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోనసీమ జిల్లా అమలాపురం పశుసంవర్ధక శాఖ అధికారి కాట్రేనికోన మండలానికి ప్రత్యేక అధికారి గా నియమితులయ్యారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:

 

కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్:-

కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో సిహెచ్ అప్పారావు అధ్యక్షతన నూతనంగా మండలానికి వచ్చిన ప్రత్యేక అధికారి ఏ చంద్ర పాల్ ఆధ్వర్యంలో మండలంలో ఉన్న అధికారులకు ,తాసిల్దార్ ,మండల్ ఇంజనీరింగ్ అధికారులు, సహాయక ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్ హౌసింగ్ ,వైయస్సార్ క్రాంతి పదం ,మండల కోఆర్డినేటర్ ఏపి ఓ ,ఉపాధి హామీ పథకం ,వారికి వారి శాఖల ద్వారా జరుగుతున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు..

ఈ బి సి నేస్తం ,జగనన్న చేదోడు, జగనన్న తోడు , డిజిటల్ టెక్నాలజీ మెంట్ ,ఇంట్రెస్ట్ రియంబర్స్మెంట్, కరెంట్ మీటర్ సర్వే, గ్రామ సచివాలయం సర్వీస్ రిక్వెస్ట్, ఆధార్ సర్వీస్ ల్యామినేషన్ సర్వీసెస్, ఇంటర్నెట్ స్పీడ్ మానిటరింగ్ ఈ శ్రమ అప్లికేషన్ తదితర వాటిపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ రెవెన్యూ అధికారులు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అలాగే ప్రతి గ్రామ సచివాలయ ఉద్యోగులు కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ మూడుసార్లు కచ్చితంగా ఇవ్వాలని వాలంటీర్స్ అందరూ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాలి అని తెలియజేశారు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రతి పంచాయతీలో తప్పకుండా అమలు చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సి .నాగ లక్ష్మమ్మ సహాయక ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం, సహాయక ఇంజనీర్ హౌసింగ్ జి ఎస్ ఎన్ దాస్, మండల్ ఇంజనీరింగ్ అధికారి సయ్యద్, ఏ పీ ఓ ఎస్ శ్యామ్, వైయస్సార్ క్రాంతి పదం మండల కోఆర్డినేటర్ ఎం వెంకటేశ్వరరావు ఈ ఓ పి ఆర్ అండ్ ఆర్ డి జె వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement