బంటుమిల్లి పంచాయతీ కార్యాలయము నందు ఘనంగా
పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన (విశ్వం వాయిస్) న్యూస్:-
కోనసీమ జిల్లా లో కాట్రేనికోన మండల పరిధిలోగల అన్ని గ్రామ పంచాయితీల నందు ఆదివారం తేదీ 24 4 22 నాడు పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బంటుమిల్లి గ్రామ పంచాయతీ నందు గ్రామ సర్పంచ్ గుత్తుల నాగ వెంకట సత్యనారాయణ అధ్యక్షతన ప్రత్యేక వైబ్రెంట్ గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభ నందు సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా కట్టుబడి ఉన్నామని తీర్మానం చేయడం జరిగింది.
తొమ్మిది రకాల ( థీమ్స్) విషయాలను సాధించాలని 1 పేదరికం, 2 ఆరోగ్యం 3 చిన్న పిల్లల హక్కులు 4 గ్రామంలో నీటి నాణ్యత 5 పర్యావరణం 6 స్వయం సమృద్ధి 7 సామాజిక భద్రత 8 అభివృద్ధి పథకాలు 9 లింగ సమానత్వం ఈ 9 విషయాలు సాధించడమే మా సంకల్పం అని గ్రామ మినిట్స్ లో రాసి తీర్మానించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సిహెచ్ గంగా భవాని, ఎంపీటీసీ ర్యాలీ వీరబాబు, వార్డు మెంబర్లు సచివాలయ సిబ్బంది, వాలంటీర్, మహిళా పోలీస్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు