విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:
తొండంగి: ఏప్రిల్ 24: విశ్వం వాయిస్ న్యూస్: రాష్ట్రంలో రోడ్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రోడ్ల మరియు భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో రూ 1.70 కోట్ల నిధులతో మండల పరిధిలోగల ఏవి నగరం గ్రామం నుంచి కోదాడ మీదగాశృంగవృక్షం రోడ్లు నిర్మాణ పనులకు శనివారం సాయంత్రం మంత్రి దాడిశెట్టి రాజా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన రహదారి అన్నిటినీ దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో అన్ని రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగనన్న అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విధంగా వాలంటరీ సచివాలయం వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని మంత్రి తెలియజేశారు. ఈకార్యక్రమంలో
పెరిగి కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం గంగ భవాని, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత ఆనందహరి, తుని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొయ్య మురళీకృష్ణ, లోవ దేవస్థానం చైర్మన్ బొంగు ఉమా రావు, మండల ఎంపిపి అంగులూరి అరుణ్ కుమార్, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు, యాదాల రమణ,ఎంపీటీసీ గంగీరి అడవియ్యా, సీనియర్ నాయకులు ఎలిశెట్టి గిరి, గాబు రాజు, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.