సద్వినియోగం చేసుకున్న గ్రామస్తులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన-(విశ్వం వాయిస్ న్యూస్):కాట్రేనికోన మండలం గచ్చకాయల పొర గ్రామంలో అమలాపురం కోనసీమ కేర్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ కారం రవితేజ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును ఆదివారం ప్రారంభించారు. స్థానిక గ్రామ నాయకులు అధ్యక్షతన జరిగిన మెగా మెడికల్ క్యాంపు కు ఉదయం నుండే పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి వారి రోగాలను డాక్టర్ ముందు తెలుపుకున్నారు. దీంతో వారికి అవసరమైన వైద్య పరీక్షలు వహించి వారికి కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ లో సుమారు 500 మంది పాల్గొని తమ తమ వైద్య అవసరాలను సద్వినియోగం చేసుకున్నారు.
అనంతరం డాక్టర్ కారం రవితేజ మాట్లాడుతూ గ్రామంలో అధిక సంఖ్యలో మధుమేహం,గుండె ,చర్మ సంబంధించిన వ్యాధులతో రోగులు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు. సరైన వైద్య సహాయాలు అందిస్తే గ్రామం ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్ద బడుతుందని ఆయన తెలిపారు. ఈ మెడికల్ క్యాంప్ లో అమలాపురం చెందిన 30 మంది వైద్యులు, కోనసీమ కేర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
గచ్చకాయ పొర గ్రామస్తులు తమ గ్రామానికి మందుల తో పాటు వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన కోనసీమ కేర్ హాస్పిటల్ డాక్టర్ రవి తేజ తో వచ్చిన వైద్య బృందానికి అభినందనలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సంగాని మునీంద్ర వర్మ, స్థానిక నాయకులు పెసంగి రంగారావు, వర్మ, బొమ్మిడి సూరిబాబు, సంగాని పోతురాజు, సంగాని గణపతి, ముదే నూకరాజు, అంగాని సత్తిరాజు, లంకె వీర్రాజు, ముదేశ్రీను, ఓలేటి దుర్గారావు, మల్లాడి భాస్కరరావు, ఓలేటి సత్యనారాయణ, ముదే రాంబాబు, సంగానీ వెంకటరావు తో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.