మొదలుపెట్టిన ఏ పి ఆర్ పి రెండు రోడ్లు పనులు దాదాపు పూర్తి అవుతున్న చిల్లిగవ్వ కూడా రాలేదని కాంట్రాక్టర్ మనోవ్యద
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన (విశ్వం వాయిస్ )న్యూస్:-
కాట్రేనికోన మండల పరిధిలోగల బంటుమిల్లి పంచాయతీ ఏ పి టి ఆర్ పి నిధులతో బంటుమిల్లి వెళ్లే రోడ్డు పనులు శర వేగంగా సాగుతున్నాయి అని బంటుమిల్లి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేసిన రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పిల్లి సురేష్ 2021 సంవత్సరం లో మొదలుపెట్టిన రోడ్ల పనులకు సుమారు సంవత్సరం పాటు అవుతున్న ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా బిల్లు రాలేదని ప్రభుత్వం మీద భరోసాతో వ్యయప్రయాసలు ఓర్చి దఫ దఫాలుగా పనులు పూర్తి చేశానని తెచ్చిన వాటికి వడ్డీ అయిపోతున్నాయి అని ఇప్పటికైనా ప్రభుత్వం వారు బిల్లులు శాంక్షన్ చేస్తారని నమ్మకంతో ఈ పనులు శరవేగంగా పూర్తి చేశానని వారి యొక్క మనోవ్యధ తెలియజేశారు