విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
పి. గన్నవరం మండల పరిధిలోని కె.ఏనుగుపల్లి గ్రామ సచివాలయంను ఎంపీడీవో ఐ.ఇ.కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా అందించాలని సూచించారు. గ్రామ పరిధిలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వై కొత్తపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ కూలీల హాజరును ఆయన పరిశీలించారు.