Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రైతులకు అవగాహన కల్పించేందుకు సిబ్బందికి శిక్షణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– మండల వ్యవసాయ అధికారి కె. ప్రభాకర్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం ,విశ్వం వాయిస్ న్యూస్: రైతు భరోసా కేంద్రంలో దాన్యం కొనుగోలు సహాయ సిబ్బంది కి ధాన్యం కొనుగోలు పై శిక్షణ కార్యక్రమం మంగళవారం స్థానిక మండల వ్యవసాయ అధికారి కె. ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా
వ్యవసాయ అధికారి మాట్లాడుతూ మండలంలోని 19 రైతు భరోసా కేంద్రాలలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ లు, టెక్నికల్ అసిస్టెంట్లు,విఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రతి ఒక్కరూ తమ యొక్క విధులను ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల పరిధిలో పండించే వరి పంటను ఈ కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు అమ్ముకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. సాధారణ రకమునకు కనీస మద్దతు ధర 1455 రూపాయలు 75 కేజీలు బస్తా కు, ఏ గ్రేడ్ రకానికి 1470 రూపాయలు 75 కేజీలు బస్తా కు నిర్ణయించడం జరుగుతుందని ఆయన అన్నారు.కనీస మద్దతు ధర పొందటానికి కేంద్ర ప్రభుత్వం వారు అనుమతించిన గరిష్ట పరిమితికి లోబడి నాణ్యతా ప్రమాణాలను పాటించవలసి ఉంటుందన్నారు.
ధాన్యం కొనుగోలు లో వ్యవసాయ, రెవెన్యూ, కోపరేటివ్ డిపార్ట్మెంట్లో సమన్వయంతో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది అందరూ కూడా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా అవగాహన క్షేత్రస్థాయిలో కల్పించాలని వివరించారు.
రైతులందరూ కూడా 17 శాతం లోపు తేమ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. అనంతరం తహశీల్దార్ ప్రకాష్ బాబు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి వి ఆర్ వో లు స్థానిక మండలం లోని రైస్ మిల్లు కు కస్తోడియన అదికారులకు వేయడం జరిగిందని, వీరు మిల్లు కు వచ్చే దాన్యం వివరాలను ప్రతిరోజు రైతు భరోసా కేంద్రం లో సమన్వయం చేసుకొని డేటా ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా క్షేత్ర స్థాయి సిబ్బంది అందరూ కూడా రైతులకు ప్రభుత్వం అందించిన మద్దతు ధర పై అవగాహన కల్పించి రైతులకు మంచి ధర వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సి ఈ ఓ లు, మోనిటరింగ్ అదికారి అప్పారావు, వి ఆర్ వో లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్రం క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement