– మంత్రులకు జనసైనికుల…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
తమ నాయకుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలు చేస్తే ,గ్రామాలలో తిరగనీయమని స్థానిక జనసేన అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, ఇతర జనసైనికులు కొత్తగా పదవులు చేపట్టిన మంత్రులను హెచ్చరించారు. మంగళవారం జనసేన పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమర్ నాధ్ తన గతాన్ని మర్చిపోయి పవన్ కళ్యాణ్ ను విమర్శించడం గురువింద సామేత గుర్తుకు వస్తోందని తెలిపారు.
తమ నాయకులు పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు అనంతపురం, చింతలపూడిలో తన సొంత డబ్బు ఐదు వందల కోట్ల రూపాయలు పంచి పెడితే, ఈ మంత్రులకు వచ్చిన బాధ ఏమిటో అర్థం కావడం లేదని అశోక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దేవాలయాలపై దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, అయినా సరే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తోందని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుని తమ నాయకుని గురించి మాట్లాడలని హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే నష్టం ఎవరికి నష్టం కలుగలేదని, కానీ ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేరుతో ఓ చేత్తో డబ్బులు ఇచ్చి, అనేక రకాల పన్నులు ద్వారా, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ద్వారా రెండవ చేత్తో ఇచ్చిన దానికి రెండితలు లాగేసుకోవడం ద్వారా ప్రజలకు జరిగే నష్టం ఊడ్వలేనిదని సంగిశెట్టి తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాలన ముగింపు దగ్గరలో ఉందని, మంత్రులు మునిగిపోయే నావలో ప్రయాణిస్తున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా మంత్రులు ప్రవర్తించాలని అశోక్ సూచించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు వాసిరెడ్డి శివ, తలాటం సత్య, ఆట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.