వైఖరిని నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన జనసేన పార్టీ వీర మహిళలు""
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రుల వైఖరిని నిరసిస్తూ అమలాపురం జనసేన పార్టీ వీర మహిళలు నల్లవంతెన వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారని రాష్ట్రంలో మూడు వేల మంది పైగా కౌలు రైతులు అప్పులపాలై మరణిస్తే వారికి అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులు దాడిశెట్టి రాజా,గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు కొట్టు సత్యనారాయణ తదితరులు తమ అధినేత పై అవాకులు చవాకులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వీర మహిళలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వీర మహిళలు చిక్కం సుధారాణి కౌన్సిలర్లు గండి హరిక,పిండి అమరావతి, ఎంపీటీసీలు తాళ్ళ నరసాయమ్మ, నాగులపల్లి శేష వేణి ముత్యాల మణి,గోళ్ళ కమల,నార్ని అమ్మాజీ,దోనిపాటి వెంకట లక్మి,పుష్పాంజలి తదితరులు పాల్గొన్నారు.