విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి. గన్నవరం(విశ్వం వాయిస్ న్యూస్) పి గన్నవరం మండల కార్యాలయం వద్ద శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీడీవో ఐ.ఇ.కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ శ్రీశ్రీ తన యొక్క రచనలతో ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పప్పుల శ్రీనివాసరావు, కొంబత్తుల యేసు బాబు, పంచాయతీ కార్యదర్శి జీవి కుమార్, నేలపూడి రామకృష్ణ, జనని ఫౌండేషన్ చైర్మన్ సరేళ్ల ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ విశ్వేశ్వర రావు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ తదితరులు పాల్గోన్నారు.