విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవరం:
అల్లవరం విశ్వం వాయిస్:కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో ఎంట్రికొన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకలక్ష్మీ వేములమ్మ అమ్మవారి జాతర తీర్ధ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాస్, ఆలయ కమిటీ వంగా దొరయ్య నాయుడు,వర్రే సూరిబాబు,తిక్కిరెడ్డి బాబురావు,తిక్కిరెడ్డి బూరయ్య, సాపే సత్యనారాయణ,తిక్కిరెడ్డి సత్యనారాయణ,వాసర్ల శ్రీమన్నారాయణ,కన్నిపాముల రాంబాబు,మొల్లెట్ సాయిబాబు,ఎన్.నాగరాజు,మొమ్మిడివరపు వెంకటేష్,పొలమూరు ఏడుకొండలు,నార్గాన శ్రీను,గెద్దడ శ్రీను,మట్టపర్తి ధర్మరాజు,మొల్లేటి భద్రం,చుట్టుగుళ్ల సత్యనారాయణ,యీటి గోపాలం, పాలకవర్గ సభ్యులు,గ్రామస్తులు భారీ స్థాయిలో అమ్మవారిని దర్శించుకున్నారు.