Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా రంజాన్ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆలమూరు: కండ్రికపేట అల్ హుడా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అలమూరు:

 

ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ రంజాన్ మాసం ప్రారంభమైనప్పుడు , నిశ్శబ్ద సమయం ఉంటుంది. ఈ 30 రోజులు ప్రతి సాయంత్రం చంద్రుడిని చూసిన తరువాత వారు ఉపవాసం విరమించుకుంటారు.చివరి రోజు నెలపోడుపుతో రంజాన్ ఉపవాస దీక్షలు విరమించి మరోసటి దినాన్ని రంజాన్ పండుగ గా నిర్ణయిస్తారు. అనంతరం రంజాన్ ను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. వివరాల్లో కి వెళ్తే రంజాన్ పండుగ సందర్భంగా మండల కేంద్రమైన ఆలమూరు ఖండ్రికపేటలో గల అల్ హూదా మసిదులో ముస్లిం సోదరులు చిన్న పెద్దా అన్న తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలను ధరించి ఎంతో భక్తి భావంతో సామూహిక ప్రార్థనలు చేసి అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ రంజాన్ వేడుకలకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి , జాతీయ సేవా అవార్డు గ్రహీత, ప్రముఖ పారిశ్రామికవేత్త,ఆలమూరు మండలం కాపు సంఘం అధ్యక్షులు, చల్లా ప్రభాకర్రావు, జిల్లా కమ్మసంఘం సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త వంటిపల్లి పాపారావు, ఉప సర్పంచ్ చల్లా లక్ష్మీ భూషణంలను ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించి పవిత్ర మసీదులోకి ఆహ్వానించడం జరిగింది.రంజాన్ ప్రార్థనలకు హాజరై ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ మసీదుకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉందని ముస్లిం సోదరులు గతంలో తెలుపగా ఈ విషయం పై చల్లా ప్రభాకర్రావు తక్షణమే స్పందించి ముస్లిం సోదరులు,అడ్వకేట్ షరీఫ్ తో కలిసి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి దృష్టిలో పెట్టడం జరిగిందని తెలిపారు ఆ విషయంపై ఈ రోజు పవిత్ర మసీదు వద్ద ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తో చరవాణిలో సంభాషించగా ఆయన తక్షణమే స్పందించి త్వరలోనే మార్కెట్ కమిటీ నిధులతో లింక్ రోడ్లు తో చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జొన్నాడ ఎస్ మలుపు వద్ద నుండి కాలవ గట్టు మీదుగా అంటే మసీదు ముందునుండి ఖండ్రికపేట వరకు త్వరలోనే రోడ్డు వేసే ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ కలిపి చల్లా ప్రభాకర్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తదనంతరం శిథిలావస్థలో ఉన్న మసీదును సుందరంగా తీర్చిదిద్దినదుకు పాపారావు కు ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement