విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్): మండలం పరిధిలో మడికి (మల్లావానితోట) గ్రామానికి చెందిన నీలా సతీష్ కుమార్, అంజని నూతన వధూవరులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండలంలో గల 24 గ్రామ సచివాలయ సిబ్బంది, 18 పంచాయతీల సిబ్బంది, కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.