విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్) అంగర గ్రామ0 అశిరాంభ ఆలయం వద్ద వున్న విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఆయన వర్ధంతి పుర్శ కరించుకొని ఐ. ఎఫ్. టి. యు జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారానే భారత స్వతంత్రం సాధించవచ్చు అనే విధానాన్ని అనుసరించిన అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడు అన్నారు. నాటి తెల్ల దొరలు పోయి నేటి నల్ల దొరలు వచ్చి, ప్రకృతి వనరులు దోచేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఏవో సంక్షేమ పథకాలు తో మభ్యపెట్టి,ఇసుక, గనులు, అడవీ సంపద వంటి ప్రకృతి సంపదను దోచుకొని పోతున్నారన్నారు. నేటి రాజకీయ నాయకులు అక్ర మార్జన పై యువత అల్లూరి సీతారామరాజు ని స్ఫూర్తి గా తీసికొని పోరాటం చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంటపల్లి భీమ శంకరం విప్లవ గీతాలు ఆలపించారు. విగ్రహ దాత లంకె విజయ్ కుమార్, వీరబాబు, లంకెస్వామి, లంకెసాయి, లంకెసాంబ, తో రాటి కనకయ్య, లేగ పెదకాపు, చిన కాపు, మేడపల్లి కనక రామ కృష్ణ, ఎమ్. సాయి రుద్ర లు పాల్గొని విప్లవం వర్ధిల్లాలి. సామ్రాజ్య వాదం నశి0చాలని నినాదాలు చేశారు.