విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా తన సంఘం కోసం ఎంతో పాటుపడిన మాజీ అధ్యక్షులు కంచర్ల మాణిక్యాలరావు (జిల్లా) ప్రథమ వర్ధంతి సందర్భంగాపి గన్నవరం ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో
పి గన్నవరం మూడు రోడ్ల కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలల అలంకరణ చేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్రిీ॥శే లు కంచర్ల మాణిక్యాలరావు(జిల్లా) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా తన నాయకత్వ పటిమతో జిల్లాలోని ఆర్యవైశ్య సంఘాలకు ఊపిరి లూదిన వైశ్య ధీరుడని అన్నారు
అనంతరం పేదలకు ఆయన జ్ఞాపకార్థం భోజన పొట్లాలను అందజేశారు
ఈ కార్యక్రమంలో.పెంటపాటి శ్రీనివాసరావు.పాబోలు కృష్ణ.తమ్మనప్రసాద్.కోలా శ్రీనివాస్.కట్టాగుప్తాజీ. మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు