# స్థానికులు హార్షం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పెనుమంట్ర:
పెనుమంట్ర (విశ్వంవాయిస్ ప్రతినిధి)
ప్రధాన రోడ్లు మూడునాళ్ళ ముచ్చటేనా వార్తకు స్పందనలు. కొద్ది రోజులుగా నిడదవోలు నుండి నర్సాపురం ప్రధాన రహదారులను ప్రైవేటు కాంట్రాక్టు ద్వారా క్రొత్త తారు రోడ్డులతో ఆధునీకరణ చేస్తున్నారు.అయితే నెగ్గిపూడి స్టేట్ బ్యాంక్,సాయి ఐడియా షోరూము మధ్య ప్రాంతంలో చిన్న పాటి వర్షం కురిస్తే చాలు పెద్ద ఎత్తున నీటి నిల్వలతో బురదమయంగా మారి అనతికాలంలోనే రోడ్డు పాడైపోతుందని స్థానికుల ఆవేదనతో వర్షపు నీరు నిల్వ ఉండటంతో న్యూస్ ప్రతినిధి ఫోటోలు తీయడం గమనించిన సంబంధిత కాంట్రాక్టర్ సిబ్బంది ఆగమేఘాలపై ప్రధాన రహదారి ఆనుకుని వున్న ఇంటి స్థలములో నుండి గండికొట్టి తాత్కాలికంగా వర్షపు నీరు మళ్ళించారు.ఇప్పటికైనా పూర్తిస్థాయిలో శాశ్వత ప్రాతిపదికన వర్షపు నీటి నిల్వ ఉండకుండా రహదారులు, భవనాలు శాఖ అధికారులు చూడాలని,ప్రధాన రహదారుల నిర్మాణంలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటించేలా,చిరకాలం మన్నేవిధంగా,రాష్ట్ర ప్రభుత్వ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్,శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆశయాలు సాధించేలా చర్యలు చేపట్టాలని స్థానికుల ఆకాంక్ష వ్యక్తం చేస్తూ,ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న విశ్వంవాయిస్ ప్రతినిధికి ధన్యవాదాలు తెలిపారు.