విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్,
ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మెగా కంటి వైద్య శిబిరం శనివారం 9 గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించడం జరిగింది, ఈ కంటి వైద్య శిబిరంలో 200 మంది రోగులు కంటి పరీక్షలు నిర్వహించగా 37 మందికి కంటి ఆపరేషన్ చేయించుటకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో గౌతమి నేత్రాలయ కంటి ఆసుపత్రి సిబ్బందితోపాటు కొత్తలంక హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గొర్రెల ఉదయభాస్కర్, గ్రామ నాయకులు నడిమింటి సూర్య ప్రభాకర్ రావు, వి పూరి సత్యనారాయణ రాజు, తోలేటి రాంబాబు, దాసరి నాగేశ్వరరావు, కొత్తలంక ఎంపీటీసీ గీసాలా దుర్గా చందర్రావు, సామంత కుర్తి సుబ్బారావు, విత్తనాల భైరవ స్వామి, మోకా రాంజీ భీమారావు, మట్ట గోవింద్, దాసరి గంగాధర్ రావు, నడిమింటి సూర్య భాస్కర్ రావు, మాస్టర్ లతోపాటు కొత్తలంక పెద్దలు మరియు ఎంపీటీసీ సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.