Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తెల్లోడిపై అల్లూరి పోరాటం దేశానికే ఆదర్శం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, మే 7, (విశ్వం వాయిస్ వార్త) ;

భరత మాత దాశ్య శృంఖలాలను తెంచడం కోసం మన్యం వీరుడు, విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాలకే తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసారని అల్లూరి చరిత్ర పరిశోధకులు, పి.బాలభాను (ఈఎన్ఎస్ బాలు) కొనియాడారు. అల్లూరి 89వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని అల్లూరి విగ్రహానికి ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ ఆధ్వర్యంలో శనివారం పూల మాలలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈఎన్ఎస్ బాలు మాట్లాడుతూ, అల్లూరి మరణించి నేటికి 98 సంవత్సరాలు అయ్యిందన్నారు. అల్లూరి బ్రిటీష్ సేనలపై చేసిన తిరుగుబాటు ఉద్యమం ఒక చారిత్రాత్మకమైనదని, అది భారత దేశంతోపాటు ప్రపంచ దేశాలకు నేటికీ ఒక దిక్సూచి అని ఆయన అన్నారు. అప్పటి బ్రిటీష్ కలెక్టర్ రూథర్ ఫర్డ్ కి అల్లూరి సీతారామరాజు ఇదే శంఖవరం గ్రామం నుంచి మిరప కాయ టపా వర్తమానం పంపి, దమ్ముంటే తనను నేరుగా వచ్చి కలవాలని, సాయంత్రం వరకూ స్థానిక పాఠశాలలో బస చేస్తానని సవాల్ విసిరారని, అయితే అల్లూరి మిరపకాయ టపా యావత్ బ్రిటీషు ప్రభుత్వాన్నే గడ గడ లాడించి అల్లూరిని కలిసే దైర్యం ఆ కలెక్టర్ చేయలేక పోయారని బాలభాను గుర్తు చేశారు. అంతటి దైర్యశాలి అల్లూరి మన్యం పితూరీ ఉద్యమం శంఖరం, అన్నవరం, బెండపూడి గ్రామాల్లో కూడా కొనసాగిందని ఆయన తెలిపారు. అల్లూరి మన్యం పితూరి విప్లవం దేశానికే ఒక ఆదర్శమని బాలభాను కొనియాడారు. పంచాయితీ కార్యదర్శి సీహెచ్ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన శంఖవరం గ్రామంలో ఆయనకు నివాళులు అర్పించడం గర్వంగా ఉంది అన్నారు. ఆయన స్పూర్తితో ప్రజలకు మరింత ఉన్నతంగా సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తామని అన్నారు. సీతారామరాజు పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో సచివాలయాల కార్యదర్శులు శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జేఏబీసి రమణమూర్తి, మూడు సచివాలయాల సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement