Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఆర్టీసీ డ్రైవర్ మదిలో పుట్టిన వక ఐడీయా…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* ఓకేఒక్క!! ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ప్రమాదాలకు
చెక్. పెడుతుంది. వాటే ఐడియా… డ్రైవర్ రాజా…!*

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

రావులపాలెం(విశ్వం వాయిస్)
..కోనసీమ జిల్లా:, రావులపాలెం ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్టుగా.. ఆ ఆర్టీసీ డ్రైవర్‌ మదిలో పుట్టిన ఓ ఐడియా.. ఎన్నో ప్రమాదా లను నివారిస్తోంది. బస్సుకు ఆయన అమర్చిన స్టీల్‌ బాల్‌ ఎన్నో ప్రాణాలను కాపాడు తోంది. ఈ ఐడియా కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురo గ్రామా నికి చెందిన వీవీవీ సత్యనారా యణరాజుది.ఈయన రావుల పాలెం డిపో లో డ్రైవర్ గా పనిచేస్తున్నారు.రోడ్డుపై వాహనంలో వెళ్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చే ఇతర వాహనాలను గుర్తించేందుకు వాటికి కుడి, ఎడమ వైపు రియర్‌ వ్యూ అద్దాలు ఉంటా యి. వాటి ద్వారా వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ డ్రైవర్లు తమ వాహనాలను జాగ్రత్తగా నడుపుతూంటారు. సాధారణంగా బస్సు డ్రైవర్‌కు ముందు భాగంలో 5 అడుగుల ఎత్తు వరకూ కనిపించదు. బ స్టాండ్లు, బస్టాపుల్లో ఆగి ఉన్న బస్సు ముందు నుంచి ప్రయా ణికులు, పాదచారులు రాక పోకలు సాగిస్తుండటం సర్వసా ధారణంగా కనిపిస్తుంది. అలా ఎవరైనా వెళ్తున్నప్పుడు వారు కనిపించక, ఎవరూ లేరని భావించి, డ్రైవర్లు బస్సును ముందుకుపోనిస్తూంటారు.దీనివలన ప్రమాదాలు జరుగుతు న్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేవిధంగా గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే రెండు ప్రమాదాలుజరిగి,ఆయా డ్రైవర్లు 6 నెలల పాటు సస్పెం డయ్యారు. బాధితులకు ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సివచ్చింది. ఇటువంటి ప్రమాదాలను,ఆర్టీసీ పరిహారాలు చెల్లించే పరిస్థితిని అరికట్టాలనిసత్యనారాయణరాజు తీవ్రంగా ఆలోచించారుఆ క్రమంలోనే ఆయనకు స్టీల్‌ బాల్‌ పెట్టాలనే ఐడియా వచ్చింది. 180 డిగ్రీల కుంభాకారపు స్టీల్‌ బాల్‌ను 2 అడుగుల రాడ్‌కు అమర్చి, దానిని డ్రైవర్‌ సీటుకు కుడివైపున అద్దం ముందు బిగించారు. ఆ స్టీల్‌ బాల్‌లో బస్సు ముందు భాగం ఎడమ నుంచి కుడివైపు డ్రైవర్‌ డోర్‌ వరకూ కనిపిస్తోంది. దీంతో బస్సు ముందు ఎవరూ లేరని గుర్తించడం సులభమైంది. తద్వారా ఇటువంటి ప్రమా దాలకు చెక్‌ పడింది. ఈ స్టీల్‌ బాల్‌ను అన్ని బస్సులకూ అమర్చాలని ఆర్టీసీ యాజ మాన్యం యోచిస్తోంది. ఈ స్టీల్‌ బాల్‌తయారీకికేవలంరూ.100/-రూపాయలు ఖర్చయినట్టు సత్యనారా యణరాజు తెలి పారు. ఆయన వినూత్న ఆలోచనను ఆర్టీసీ అధికా రులు, సహచర డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఎంతగానో మెచ్చుకుని, అభినందించారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement