నాయకులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ గ్రామీణం, విశ్వం వాయిస్ః
మన్యం విప్లవ వీరుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు 98 వ వర్ధంతి సందర్భంగా ఇంద్రపాలెం జడ్ బ్రిడ్జ్ సెంటర్ లో అల్లూరి విగ్రహానికి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోర్త రాజశేఖర్, సిఐటియు నగర అధ్యక్షులు మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు, డివైఎఫ్ఐ ఇంద్రపాలెం గ్రామ అధ్యక్షులు గుండు బొగుల శ్రీనివాస్, మన ఊరు మన బాధ్యత నాయకులు మేడిశెట్టి రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోర్త రాజశేఖర్, మాజీ సర్పంచ్ పలివేల వీరబాబు లు మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రెండు సంవత్సరాల పాటు గిరిజన ప్రజలను కలుపుకొని పోరాడిన మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతూ ఉంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఐక్యం చేసి పోరాడారని అన్నారు. అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో 1897 జూలై 4వ తేదీన జన్మించారన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు పర్యటించి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఏవిధంగా ఉందనేది తెలుసుకున్నారని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1922 నుండి 24 వరకు పెద్ద ఎత్తున పోరాటం చేశారన్నారు. రంపచోడవరం, రాజవొమ్మంగి, అన్నవరం, అడ్డతీగల పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఆయుధాలను తీసుకు వెళుతూ వివరంగా రాసి పెట్టి వెళ్లేవారని తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం 27 ఏళ్ళ వయసులోనే ప్రాణాలర్పించిన గొప్ప యోధుడు అన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా నేటికీ గిరిజనుల పరిస్థితి అలాగే ఉందన్నారు. స్థానిక జిల్లాలో ఐదు మండలాల్లో గిరిజన గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపక పోవడం దారుణమన్నారు. గిరిజన సబ్ ప్లాన్ గ్రామాల్లో నేటికీ మంచినీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు లేకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.రాజా, డివైఎఫ్ఐ నాయకులు ఏ.శివ, సిహెచ్ సాహిత్, సీనియర్ నాయకులు సిహెచ్. విజయ్ కుమార్, వి.చందర్రావు, చింతపల్లి రమణ, చింతపల్లి భాస్కర్, గవర బాబ్జి, ఐద్వా జిల్లా కార్యదర్శి సిహెచ్ రమణ, మహిళా సంఘం నాయకులు నాగదేవి, పద్మ, లక్ష్మి ఎస్.ఎఫ్.ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం. జి సూరిబాబు, టి .మణికంఠ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.